మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. దిమ్మతిరిగే యాక్షన్ ఇష్టపడేవారికి ఈ సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది. అదే ‘ది హంటింగ్ పార్టీ’ సీజన్ 2.. ప్రస్తుతం జియోహాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
క్రూర నేరగాళ్ల వేటలో స్పెషల్ టీమ్ సాహసాలు, ఊహించని ట్విస్టులు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. బూగీమెన్ సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు చేసే స్పెషల్ ఆపరేషన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది.
జైలు నుంచి తప్పించుకున్న కిల్లర్లను పట్టుకునేందుకు ఓ స్పెషల్ టీమ్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో ‘ది హంటింగ్ పార్టీ’ సీజన్ 2 ముందుకు వెళ్తుంది. మొదటి సీజన్ 2025లో NBCలో ప్రారంభమైంది. ఇందులో ప్రమాదకరమైన కిల్లర్స్ తప్పించుకున్న సంఘటన నేపథ్యంలో ఒక టీమ్ వారిని పట్టుకునే విధానంలో సాగుతుంది. అలాగే రెండో సీజన్ 2026 జనవరిలో ప్రారంభమైంది. ఇది కూడా అదే టీమ్ కొనసాగింపు కథను చూపిస్తుంది. ఆ సీన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.
ఇక ప్రస్తుతం జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కొత్త సీజన్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను అందిస్తోంది. అదిరిపోయే యాక్షన్, అంతకుమించిన థ్రిల్ తో ఈ సీజన్ ఆద్యంతం అలరిస్తోంది. ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఎపిసోడ్ 1 లో బూగీమెన్ అనే సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఇక ఎపిసోడ్ 2 లో అడ్రియాన్ ను పట్టుకుంటారు. మరోవైపు జైలులోని రహస్యాలు కూడా బయటపడుతుంటాయి. దాంతో ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది.


































