అన్నంలో విషం కలిపి విద్యార్థులను చంపేయండి

 సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్‌ కిషన్‌ నాయక్‌ అమానుషంగా ప్రవర్తించాడు.


అసభ్య పదజాలంతో తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థులు తనపై ఫిర్యాదు చేశారనే కోపంతో విచక్షణ మరిచాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్‌ చేసి… ‘ నా మీదనే ఫిర్యాదు చేస్తారా ? వాళ్ల అన్నంలో విషం కలిపి చంపేయండి” అంటూ హుకుం జారీ చేశాడు.

ఇందుకు సంబంధించిన ఆడియో శుక్రవారం వైరల్‌వ్వగా.. ఈ ఘటనపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య.. సదరు వార్డెన్‌ కిషన్‌ నాయక్‌ను సస్పెండ్‌ చేశారు. అసలేం జరిగిందంటే..

వార్డెన్‌ కిషన్‌ నాయక్‌ తీరుతో విసిగిపోయిన వసతి గృహంలోని విద్యార్థులు గురువారం రాత్రి రోడ్డెక్కారు. కడ్పల్‌-సిర్గాపూర్‌ రహదారిపై బైఠాయించి వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక ఎస్సై మహేష్‌, సర్పంచ్‌ శ్రీనివా్‌సరావు విద్యార్థులకు నచ్చజెప్పారు. వసతి గృహానికి వచ్చిన ఏఎ్‌సడబ్ల్యూవో చందా శ్రీనివా్‌సకు వార్డెన్‌ తీరుపై ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న కిషన్‌నాయక్‌… శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి వచ్చి పిల్లలను బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్‌ చేసి అన్నంలో విషం కలిపి విద్యార్థులను చంపేయమని హుకుం జారీ చేశాడు. ఈ ఫోన్‌ సంభాషణ బయటికి రాగా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.