రెడీ ఫర్ సమ్ యాక్షన్? ఏంటి.. సిద్ధమేనా?… అంత నిదానంగా అడుగుతారేంటండీ.. మేం ఎప్పటి నుంచో వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే అంటారా? విషయం అర్థమైన వారయితే మీలాగే రియాక్ట్ అవుతారు.. అసలు దేని గురించి ఇదంతా అని ఆలోచించే వారైతే… ఇక ఆలస్యం చేయడం ఎందుకు… కలిసి మాట్లాడుకుందాం… పదండి.
నందమూరి మోక్షజ్ఞ రీసెంట్ ఫొటోని చూశారా? ఫ్యాన్స్ కోసమే స్పెషల్‌గా షేర్ చేశారు ప్రశాంత్ వర్మ. సింబా ఈజ్ కమింగ్ అంటూ ఆయన యాడ్ చేసిన హ్యాష్‌ట్యాగ్ నందమూరి సర్కిల్స్ లో జోష్ నింపుతోంది.
మా బాలయ్యబాబు ముద్దుల కొడుకు ఎంట్రీ కోసం మేం ఎన్నాళ్లుగానో వెయిటింగ్ అంటూ ఇన్‌స్టంట్‌గా షేర్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ వర్మ పోస్టుకి మోక్షజ్ఞ రిప్లై ఇవ్వడం కూడా బావుంది.
ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ కంటెంట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌లోనే ఉంటుంది సినిమా. డిసెంబర్ 5న మూవీకి ముహూర్తం పెట్టేశారు మేకర్స్. ఓపెనింగ్‌కి ముందే మోక్ష్ నయా లుక్ పోస్ట్ చేసినందుకు ప్రశాంత్ వర్మ కి థాంక్స్ చెబుతున్నారు ఫ్యాన్స్.
మోక్షు లుక్ అదుర్స్ అనే రివ్యూలు పడుతున్నాయి. కొత్త లుక్ బావుందంటూ మెచ్చుకుంటోంది నందమూరి సైన్యం. మోక్ష్ కటౌట్‌ని చూడగానే, ఆయన ఏ రేంజ్‌లో ట్రైన్ అయ్యారో అర్థమవుతోందని అంటున్నారు క్రిటిక్స్. సోషియో ఫాంటసీ స్క్రిప్ట్ తగ్గట్టు.. మోక్ష్ తనను తాను బాగానే మలచుకున్నారనే కాంప్లిమెంట్లు కూడా వినిపిస్తున్నాయి.