10 లక్షల మంది ఎగబడి మరీ ఈ కారు కొనేశారు – ఎందుకింత డిమాండ్..

Maruti Ertiga One Million Sales: కాలం మారుతోంది.. చిన్న కార్లతో పాటు పెద్ద కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు దేశీయ విఫణిలో ఫ్యామిలీ కార్స్ కూడా విరివిగా లాంచ్ చేస్తున్నాయి.
కొత్త కార్లు ఎన్ని వచ్చినప్పటికీ కొంత మంది నమ్మికైన బ్రాండ్స్ మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఒకటి ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) కంపెనీకి చెందిన మూడు వరుసల ఎంపివీ ‘ఎర్టిగా’ (Ertiga).

10 లక్షల సేల్స్..

మారుతి ఎర్టిగా 2012లో భారతీయ విఫణిలో అడుగుపెట్టినప్పటి నుంచి, ఈ కారు ఏకంగా ఒక మిలియన్ అమ్మకాలను (10 లక్షలు) పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే ఎర్టిగా కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందని ఇట్టే అర్థమైపోతోంది. నిజానికి ప్రారంభంలో ఈ MPV గొప్ప అమ్మకాలను పొందనప్పటికీ.. 10 లక్షల యూనిట్లు అమ్ముడు కావడానికి ఎనిమిది సంవత్సరాల తొమ్మిది నెలల సమయం పట్టినట్లు సమాచారం. అయితే చివరి లక్ష యూనిట్లు సేల్ కావడానికి కేవలం ఎనిమిది నెలల సమయం మాత్రమే పట్టిందని కంపెనీ వెల్లడించింది.

Related News

ప్రారంభంలో డీజిల్ ఇంజిన్

మారుతి ఎర్టిగా 2012లో లాంచ్ అయినప్పుడు.. అప్పట్లో ఖరీదైన టయోటా కంపెనీ యొక్క ఇన్నోవాకు కొంత పోటీ ఇస్తూ అమ్మకాల పరంగా దాని ప్రత్యర్థులను అధిగమించగలిగింది. ప్రారంభంలో ఎర్టిగా 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉండేది. ఈ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉండటం అమ్మకాలు పెరుగుదలకు కారణమైంది.

2018లో సెకండ్ జనరేషన్ ఎర్టిగా విడుదలైనప్పుడు, అందులో 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాల అమలులోకి రావడం వల్ల డీజిల్ ఇంజిన్ కార్ల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ఎర్టిగా పెట్రోల్ మరియు CNG ఆప్షన్‌లతో అందుబాటులోకి వచ్చింది.

ప్రత్యర్థులకు గట్టి పోటీ..

మారుతి ఎర్టిగా ప్రస్తుతం 1.5 లీటర్ పెట్రోల్ మరియు CNG పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. కియా కారెన్స్, రెనో ట్రైబర్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తూ అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఎర్టిగా చాలామందికి ఫ్యామిలీ కార్స్ కొనుగోలుదారులకు మొదటి ఎంపికగా నిలుస్తూ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది.

వేరియంట్స్ & ధరలు

ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ (ఓ) మరియు జెడ్ఎక్స్ఐ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తున్న మారుతి ఎర్టిగా ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షల మధ్య ఉన్నాయి. ఎర్టిగాకు శక్తినిచ్చే 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్ హైబిడ్ సిస్టమ్‌తో 5 స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కాన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భవిష్యత్ మారుతి ఎలక్ట్రిక్ కార్లు..

ఇదిలా ఉండగా మారుతి సుజుకి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసే యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే eVX మరియు మరికొన్ని హైబ్రిడ్ మోడల్స్ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లుగా మార్కెట్లో విడుదలకానున్నాయి.

మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కార్లను లేదా అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత ఏడాది దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఫ్రాంక్స్ ఇప్పటికే మంచి అమ్మకాలను నమోదు చేసింది. అంతే కాకుండా గత నెలలో మారుతి బాలెనొ, స్విఫ్ట్, బ్రెజ్జా వంటి కార్లు ఉత్తమ అమ్మకాలు పొందిన టాప్ 10 కార్ల జాబితాలో కూడా స్థానం సంపాదించాయి.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ‘తెలుగు డ్రైవ్‌స్పార్క్’ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వండి.

Related News