ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందిలో నెగిటివ్ ఫీలింగ్స్ చాలా పెరిగిపోతున్నాయి. దీంతో నిద్రలేమి, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి మైండ్ కి రిలీఫ్ కావాలంటే అది మనం ఉదయం చేసే పనులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి. ఉదయాన్నే మనస్సులో వచ్చే భావాలు, ఆలోచనలు, శారీరక అనుభూతులు, ఇవన్నీ మన పని తీరు, మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం చేయనున్నాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం నెగటివ్ విషయాల కంటే.. సానుకూలంగా ఉండే విజువల్స్ ను చూసే అలవాటు చేసుకోవడం వల్ల మన జీవితం మొత్తం మారిపోతుంది. కాబట్టి అలాంటి ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ చర్చించుకుందాం..
సూర్యోదయం
ప్రతి రోజు ఉదయపు సూర్యకాంతి మన శరీరానికి తగిలితే విటమిన్ D దొరకడమే కాకుండా.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మరింత మెరుగు పరుస్తుంది. ఇది సెరోటొనిన్ అనే హార్మోన్ను విడుదల చేసి.. మన మూడ్ను పెంపొందిస్తుంది. దీని వల్ల మానసిక ప్రశాంతత, శక్తి, రోజు మొత్తం ఉల్లసంగా ఉండేలా చేస్తుంది.. అలాగే, బలమైన మానసిక స్థితి ఏర్పడుతుంది.
2. ఆకుపచ్చ చెట్లును చూడటం..
రోజు ఉదయాన్ని ప్రకృతిని చూడటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శాస్త్రవేత్తల రీసెర్చ్ ప్రకారం ఆకుపచ్చ వాతావరణం మనలోని ఒత్తిడిని తగ్గించి, మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే గుండె నిలకడగా ఉండేలా చేస్తుందటా.
3. దేవుడి ఫోటోలను చూడటం..
ప్రతి రోజు ఉదయం లేవగానే దేవుడి చిత్రపటాలను చూడటం లేదా ధ్యానం చేయడం వల్ల ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అలాగే, మనసు స్థిరంగా మారిపోయి.. కొత్త రోజు పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభమవుతుంది.
4. ప్రేరణ కలిగించే కొటేషన్స్..
మీ గోల్స్ చూసినప్పుడు మీ మైండ్ ఫోకస్ లోకి వస్తుంది. మనకు ప్రేరణ కలిగించే కొటేషన్స్ ఉదయాన్ని చదవితే ఆ రోజును ఆత్మ విశ్వాసంతో ప్రారంభించడానికి దొహద పడుతుంది. వీటి వల్ల అలసట తగ్గిపోవడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
5. ఇష్టమైన వ్యక్తులను..
ఇక, మీ కుటుంబ సభ్యుల ముఖాలు చూసినప్పుడు మన హృదయంలో ప్రేమ, శాంతి అనే ఫీలింగ్ కలుగుతుంది. మనసు హాయిగా మారి ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలా, ప్రతి రోజు ఉదయం మైండ్ పీస్ ఫుల్గా ఉండాలంటే.. పాజిటివ్ దృష్టితో చూసే దృశ్యాలను ఎంపిక చేసుకోవాలి.. ఒక చిన్న మార్పే, మన జీవితం మొత్తాన్ని మార్చగలదు అని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
































