తల్లి పోలీస్.. కొడుకు నక్సలైట్.. OTTని అల్లాడిస్తున్న మూవీని ఇంకా చూడలేదా?

ఇప్పటివరకు మీరు చాలానే నక్సలైట్ బ్యాగ్ డ్రాప్ స్టోరీస్ చూసుంటారు. వాటిలో చాలావరకు కల్పిత కథలే. కానీ, ఇప్పుడు ఓటీటీలో ఒక సినిమా యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన నక్సల్ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన మూవీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. ఆ మూవీలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదే తల్లీకొడుకుల సెంటిమెంట్. తల్లి పోలీసు అయితే.. కొడుకు నక్సల్ అవుతాడు. ఆ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణ అందరినీ భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తుంది. పోలీసులకు- నక్సలైట్లకు మధ్య జరిగే యుద్ధంలో ఓ నిరుపేద కుటుంబం సమిదలుగా మారిపోతుంది. ఇంత ఇంట్రెస్టింగ్ సినిమా ఇంకా చూడలేదా?


ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బస్టర్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ మావోయిస్టులు నియంతల్లా వ్యవహరిస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు పుడితే ఇంటికి ఒక బిడ్డని నక్సలిజంలో చేర్చాలి అని బలవంతం చేస్తారు. ఎదురు తిరిగితే హింసించి దారుణంగా చంపుతారు. ఎదిగిన పిల్లల్ని నక్సలిజంలోకి తీసుకెళ్ళి శిక్షణ ఇస్తుంటారు. అయితే ఒక కుటుంబం వీళ్ళ మీద రివర్స్ అవుతుంది. తండ్రి ఒక పోలీసు అధికారిని కలుస్తాడు. పోలీసుని కలిసినందుకు ఆ తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఆ వ్యక్తి కొడుకుని నక్సలైట్లు తీసుకెళ్లిపోతారు.

కొడును కోల్పోయిన ఆ తల్లిని పోలీసు ఆఫీసర్ కలిసి ధైర్యం చెప్తుంది. పోలీస్ ట్రైనింగ్ తీసుకో.. పోలీస్ అయ్యి వాళ్ళ మీద పగ తీర్చుకో అని చెప్తుంది. ఆ కొడుకుకు మొదటి నుంచి నక్సలైట్ అవ్వాలి అనేదే కోరిక. అందుకోసం ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఉవ్విళ్లూరుతూ ఉంటాడు. ఆ తల్లి పోలీసులతో కలిసి నక్సలైట్లను అంతం చేయడానికి యుద్ధం చేస్తుంటుంది. తన కొడుకుని ఎలాగైనా ఆ కూపం నుంచి కాపాడుకోవాలి అనుకుంటుంది. అడవిలో టెంటుల్లో రాత్రి నిద్రపోతున్న 76 మంది ఆర్మీ జవాన్ల మీద ఎటాక్ చేసి తగలబెట్టి, వారిని నరికి, తుపాకులతో కాల్చి చంపేస్తారు.

మావోయిస్టులకి సమర్థించే వర్గానికి, మావోయిస్టు వ్యతిరేక వర్గానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధంలో పావుగా మారిన ఒక పేదవాళ్ల కొడుకు.. ఆ కొడుకుని ఆ తల్లి, పోలీస్ (ఆదా శర్మ) కాపాడారా? లేక నక్సలైట్ గా వీరి మీద తిరగబడితే చంపేస్తారా? తల్లి చేతిలో ఆ కొడుకు నక్సలైట్ గా చస్తాడా? లేక తల్లి మాట విని మంచి వ్యక్తిగా జీవితం ప్రారంభిస్తాడా? కొడుకుని చదివించాలన్న తల్లి పోరాటం.. నక్సలైట్ అవ్వాలన్న కొడుకు ఆరాటం.. నక్సలిజం నుంచి బస్తర్ అనే ఊరికి విముక్తి కల్పించాలని ఒక పోలీస్ యుద్ధం. చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే మీరు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న బస్తర్: ది నక్సల్ స్టోరీ సినిమా చూడాల్సిందే.