ప్రతి వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి.. ఇవాళ థియేటర్లలోకి బాహుబలి ది ఎపిక్ మూవీ వచ్చేసింది. అందరి ఫోకస్ ఈ మూవీ పైనే ఉంది.
దీంతో పాటుగా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీ సంస్థల్లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త సినిమాలతో పాటు పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవడంతో సినీ ప్రియులు ఈ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి స్ట్రీమింగ్ కు వస్తున్నా సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతి వారం కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. శుక్రవారం బోలెడు సినిమాలు ఓటీటీ లోకి వస్తుంటాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు అందుబాటులోకి వచ్చేశాయి.
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. బ్లాక్ బాస్టర్ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అందులో కన్నడ హీరో నటించిన కాంతార చాప్టర్ 1,కొత్త లోక, ఇడ్లీ కొట్టు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఉండడంతో జనాలు ఈ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు… ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
కొత్త లోక..
ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీలో కళ్యాణ్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియండెట్ మూవీస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది.. 300 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ఇడ్లీ కొట్టు..
ధనుశ్ మంచి నటుడే కాదు..అతనిలో మంచి దర్శకుడున్నాడు. తాజాగా ఈ యేడాది విజయ దశమికి ‘ఇడ్లీ కడాయి’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు.. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు కాబట్టి కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వచ్చాయి. కాంతార చాప్టర్ 1 మూవీ పోటీగా రావడంతో ఈ మూవీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
కాంతార చాప్టర్ 1..
‘కాంతార చాప్టర్ 1’ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటి. రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది..
డిస్ని హాట్ స్టార్..
మానా కి హమ్ యార్ నహీ (వెబ్ సిరీస్).. అక్టోబర్ 31
సన్ నెక్స్ట్..
బ్లాక్ మెయిల్ ( మూవీ ) – స్ట్రీమింగ్ అవుతుంది.
జీ5..
రంగ్ బాజ్ – ది బీహార్ చాప్టర్ – అక్టోబర్ 31
భాయ్ తుజైపాయ్ – అక్టోబర్ 31
మారిగళ్లు – అక్టోబర్ 31
ఈటీవీ విన్..
రిద్ది – అక్టోబర్ 31
అమెజాన్ ప్రైమ్ వీడియో..
హెడ్డా – స్ట్రీమింగ్ అవుతుంది.
హెజ్బిన్ హోటల్ ( వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 29
నెట్ ఫ్లిక్స్..
ది అస్సేట్స్ ( మూవీ) – స్ట్రీమింగ్ అవుతుంది
అలీన్ ( మూవీ ) – స్ట్రీమింగ్ అవుతుంది.
మొత్తానికి ఈ వారం హిట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈవారం మూడు సినిమాలు ఆసక్తికరంగా ఉండడంతో మూవీల లవర్స్ ఎక్కువగా సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కొట్టు, కొత్త లోక సినిమాలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. మరి థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న ఇవి ఓటీటీలోకి వచ్చాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.. ఇక థియేటర్లలోకి ఈరోజు బాహుబలి ది ఎపిక్ మూవీ వచ్చేసింది. అలాగే నవంబర్ మొదటివారంలో బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. అందులో రవితేజ నటించిన మాస్ జాతర రేపు విడుదల కాబోతుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

































