ఆధార్ జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆధార్ నమోదు లేదా అప్డేట్ చేసుకునే నిబంధనలను మార్చినట్లు తెలిపింది.
ఆధార్ మూడో సవరణ రెగ్యులేషన్ 2025 కింద మార్పులు చేసినట్లు పేర్కొంది. దీంతో ఆధార్ కార్డు అప్లికేషన్ లేదా సవరణ కోసం కావాల్సిన డాక్యుమెంట్ల జాబితాను పేర్కొంది. గుర్తింపు, అడ్రస్, రిలేషన్షిప్ లేదా డేట్ ఆఫ్ బర్త్ వంటి వాటికి ముఖ్యమైన పత్రాలను వెల్లడించింది. అన్ని వయసుల వారు పిల్లలు, పెద్దలు, సీనియర్ సిటిజన్లకు ఈ రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. మరి తప్పనిసరిగా కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు తెలుసుకుందాం.
కొత్త ఆధార్ కోసం 5-18 ఏళ్ల వయసు వారికి డాక్యుమెంట్లు
గుర్తింపు ధ్రువీకరణకు పాస్పోర్ట్, డొమిసైల్ సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్, డీసీపీఓ సర్టిఫికెట్, ట్రాన్స్జెండర్ ఐడీకార్డులు చూపించవచ్చు. అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్, డొమిసైల్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, డీసీపీఓ సర్టిఫికెట్, ట్రాన్స్జెండర్ ఐడీ కార్డు వంటివి చూపించవచ్చు. ఇక రిలేషన్షిప్ ప్రూఫ్స్ కోసం బర్త్ సర్టిఫికెట్, వాలిడ్ పాస్పోర్ట్,డొమిసైల్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, లీగల్ గార్డియన్ షిప్ డాక్యుమెంట్, ట్రాన్స్జెండర్ ఐడీ కార్డు పని చేస్తాయి.కొత్త ఆధార్ కోసం 18 ఏళ్ల వయసు దాటిన వారికి
గుర్తింపు కార్డులుగా పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ సర్వీస్ ఐడీ కార్డు, పెన్షన్ ఫ్రీడమ్ ఫైటర్ ఐడీ కార్డు, సీజీహెచ్ఎస్/ ఈఎస్ఐసీ/ మెడిక్లెయిమ్ ఐడీకార్డు, ఉపాధి హామీ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్,యూనివర్సిటీ మార్క్ షీట్, ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్, పెన్షనర్ ఇండక్షన్ డాక్యుమెంట్ ఏదైనా చూపించవచ్చు. అడ్రస్ ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ కార్డ్, మార్కుల షీట్, బర్త్ సర్టిఫికెట్ మినహా మిగిలినవి వినియోగించుకోవచ్చు.ఆధార్ అప్డేట్ కోసం అన్ని వయసుల వారికి కావాల్సిన డాక్యుమెంట్లు
గుర్తింపు కోసం పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, సర్వీస్ ఫోటో ఐడీ కార్డు, పెన్షనర్ లేదా ఫ్రీడమ్ ఫైడర్ ఐడీ కార్డు, కిసాన్ ఫోటో పాస్ బుక్, హెల్త్ కార్డు, పెళ్లి సర్టిఫికెట్, ఉపాధి హామీ కార్డు, డైవర్స్ పత్రం, క్యాస్ట్ సర్టిఫికెట్, మార్కుల షీట్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్, బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ అకౌంట్ స్టేట్మెంట్, ట్రాన్స్ జెండర్ ఐడీ కార్డు, గెజిట్ నోటిఫికేషన్ ఉపయోగించుకోవచ్చు. ఇక అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ కార్డ్,విడాకుల పత్రం, మార్కుల షీట్, గెజిట్ నోటిఫికేషన్ మినహా మిగితావి ఉపయోగించుకోవచ్చు.



































