భారతీయులకు రేపటి (సెప్టెంబర్ 22, 2025) నుంచి ఊరట కలిగించే శుభవార్త అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన ప్రకారం, దైనందిన అవసరాల వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) శ్లాబ్స్ తగ్గిపోయాయి.
దీంతో రోజువారీ ఆహార పదార్థాలు, షాంపూలు, గృహోపకరణాలు వంటి అనేక అవసరమైన వస్తువులు ఇకపై తక్కువ ధరలకు లభించనున్నాయి (New GST List September 2025).
ముఖ్యంగా జీవన, ఆరోగ్య బీమా సేవలపై కూడా GST రేటును సున్నాకి తగ్గించారు. ఈ మార్పులతో దాదాపు 400కిపైగా వస్తువులపై పన్ను భారం తగ్గిపోనుంది. ఇది ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే నిర్ణయం. కానీ లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం 40 శాతం వరకు పన్ను కొనసాగనుంది.
కొత్త GST రేట్ల జాబితా 2025: వస్తువుల వారీగా వివరాలు
5 శాతం రేటు (మార్పు లేదు)
- రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న దుస్తులు, దుస్తుల ఉపకరణాలు
- రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న కాటన్ క్విల్ట్స్
- ఇతర టెక్స్‌టైల్ వస్తువులు (రూ.2500 కంటే తక్కువ)
18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు
- సైనిక ఉపకరణాల భాగాలు (ఎగ్జెక్షన్ సీట్లు, డ్రోన్ బ్యాటరీలు, సముద్ర ఆయుధాలు మొదలైనవి)
- డైమండ్ ఇంప్రెస్ట్ అథారిటీ కింద దిగుమతి చేసిన 25 సెంట్స్ వరకు ఉన్న కట్ అండ్ పాలిష్ డైమండ్స్
- కళాకృతులు, పురాతన వస్తువులు
12 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు
- UHT మిల్క్, చీజ్ (ప్యాక్ చేసినవి), పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటి
- కొన్ని ఔషధాలు (ఉదా: ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్, అసిమినిబ్)
- నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, పెన్సిల్ షార్పెనర్స్, క్రయాన్స్
12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడిన వస్తువులు
- కండెన్స్‌డ్ మిల్క్, బటర్, గీ, చీజ్
- రూ. 2500 కంటే తక్కువ విలువ ఉన్న ఫుట్‌వేర్
- కాటన్, జ్యూట్ హ్యాండ్ బ్యాగ్స్
- వుడ్, రతన్, బాంబూ ఫర్నిచర్
- కిరోసిన్ స్టవ్, లాంతర్లు, సీవింగ్ మెషీన్స్
- డ్రై ఫ్రూట్స్ (బాదం, హాజెల్‌నట్స్, పిస్తా మొదలైనవి)
- టెండర్ కొబ్బరి నీరు (ప్యాక్ చేసినవి)
- నామ్‌కీన్, డయాబెటిక్ ఫుడ్స్
- వ్యవసాయ యంత్రాలు, సౌర శక్తి పరికరాలు
18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడిన వస్తువులు
- టాల్కమ్ పౌడర్, షాంపూ, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్
- షుగర్ కాన్ఫెక్షనరీ (మిష్టి, బతాషా మినహా)
- చాక్లెట్స్, కేక్స్, బిస్కెట్స్
- కాఫీ, టీ ఎక్స్‌ట్రాక్ట్స్
- ఐస్ క్రీమ్, మినరల్ వాటర్ (స్వీటెనర్ లేనివి)
28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించబడిన వస్తువులు
- ఎయిర్ కండీషనర్లు, డిష్ వాషింగ్ మెషీన్స్
- టెలివిజన్ సెట్లు, సెట్ టాప్ బాక్స్‌లు
- 1200cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్/LPG/CNG వాహనాలు
- 1500cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాలు
- బస్సులు (బయో-ఫ్యూయల్స్‌పై నడిచేవి మినహా)
5 శాతం నుంచి 18 శాతానికి పెరిగిన వస్తువులు
- బొగ్గు, లిగ్నైట్, పీట్
12 శాతం నుంచి 18 శాతానికి పెరిగిన వస్తువులు
- రూ. 2500 కంటే ఎక్కువ విలువ ఉన్న దుస్తులు, కాటన్ క్విల్ట్స్
- కొన్ని రకాల కాగితం, పేపర్‌బోర్డ్
28 శాతం నుంచి 40 శాతానికి పెరిగిన వస్తువులు
- పాన్ మసాలా
- టొబాకో ఉత్పత్తులు (సిగరెట్లు, సిగార్లు, ఇతర టొబాకో రూపాలు)
- కెఫినేటెడ్ బీవరేజెస్, కార్బోనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్
- 1200cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న కార్లు
- 350cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లు
- వ్యక్తిగత వినియోగం కోసం విమానాలు, యాట్‌లు
- రివాల్వర్లు, పిస్టల్స్
18 శాతం నుంచి 40 శాతానికి పెరిగిన వస్తువులు
- ఇతర నాన్-ఆల్కహాలిక్ బీవరేజెస్
- లగ్జరీ, గూడ్స్‌పై పన్ను 40 శాతానికి పెరిగింది
- ఈ కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తాయి
































