ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. నథింగ్ ఫోన్ (2ఏ) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఈ ఫోన్‌లో పలు ఆసక్తికరమైన ఫీచర్లను జోడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ఎడిషన్ ఫోన్‌లను కేవలం వెయ్యి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు.
ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ వెనక భాగం చీకట్లో ఆకుపచ్చగా వెలగటం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. రాత్రి సమయాల్లో ఫోన్ జిగేల్‌మని వెలుగుతుంది. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాటరీని ఉపయోగించుకోకపోవడం విశేషం.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో వాల్‌పేపర్లూ కొత్తగా యాడ్ చేశారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రొ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 125జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో తీసుకొచ్చారు.
అలాగే ఇందులో.. 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్, 120హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. అలాగే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను అందింంచారు. ధర విషయానికొస్తే రూ. 29,999గా నిర్ణయించారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 50 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని ఇచ్చారు.