ఓయో రూమ్ లు కాదు.. ఇప్పుడు ఈ హాస్టల్సే యమా ట్రెండ్.. హైదరాబాదులో మామూలుగా లేదు.

 రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, సైబరాబాద్, హైటెక్ సిటీ ప్రాంతాలలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసిస్తుంటారు.


ఈ ప్రాంతాలలో పెద్దపెద్ద కంపెనీలు భారీ అంతస్తులలో భవనాలను నిర్మించాయి. ఇందులో ఫార్మా కంపెనీలలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న వారు నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పెళ్లి కాని వారు హాస్టల్స్ లో ఉంటారు. హాస్టల్స్ లో ఉండడం పెద్ద ఘోరం కాదు. చేయకూడని నేరం కూడా కాదు. అంతా సాధారణంగా జరిగిపోతే మేము ఈ కథనం రాయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇంతకీ ఈ హాస్టల్స్ లో ఏం జరుగుతోంది అంటే..

హైదరాబాదులో వర్కింగ్ ఉమెన్ హాస్టల్… వర్కింగ్ మెన్ హాస్టల్ అనేవి సర్వ సాధారణం. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా హాస్టల్స్ ఉంటాయి. అయితే హైదరాబాదులో ఇప్పటివరకు ఎన్నడూ లేని కొత్త కల్చర్ కనిపిస్తోంది. కో లివింగ్ పేరుతో హాస్టల్స్ ఏర్పాటు అవుతున్నాయి. అంటే ఆడ, మగ కలిసి ఉండొచ్చు. పక్కపక్కన పడుకోవచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. కలిసి భోజనం చేయవచ్చు. ముక్కు ముఖం తెలియని వారితో ఒకే రూం లో ఎలా ఉంటారు.. ఇది ఎలా సాధ్యమంటే.. సాధ్యమవుతోంది. గతంలో ఓయో రూం లలో అనైతిక కార్యకలాపాలు జరిగేవి. ఇప్పుడు అది పాత ట్రెండ్ అయిపోయింది. పైగా పోలీసులు తనిఖీలు జరుపుతున్న నేపథ్యంలో చాలామంది ఓయో రూమ్ ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అయితే కో లివింగ్ హాస్టల్స్ అందుబాటులోకి రావడంతో అందులో దర్జాగా ఉంటున్నారు. అందులో ఏం జరుగుతుందో చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ముక్కు ముఖం తెలియని ఆడ మగ కలిసి ఒకే చోట ఉండడం అంటే మామూలు విషయం కాదు. స్నేహితులయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాంటిది ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒకేచోట ఉండడం అంటే అనుమానించాల్సిందే.

ఇటువంటి చోట ఇష్టం వచ్చిన రోజులు ఉండి.. ఆ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్లేవారు చాలామంది ఉన్నారు. కో లివింగ్ హాస్టల్స్ లో సౌకర్యాలను బట్టి డబ్బులను వసూలు చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి 12 నుంచి 20వేల వరకు చార్జ్ చేస్తున్నారు. ఒక రూమ్ లో ఆడ, మగ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఐటీ ఉద్యోగులు మాత్రమే ఇలాంటి కల్చర్ ను ఇష్టపడుతున్నారు. ఇటువంటి హాస్టల్స్ లో ఉన్నవారు.. అనైతిక కార్యకలాపాలకు ఎక్కువ పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో భర్తలను భార్యలు.. భార్యలను భర్తలు హత్యలు చేస్తున్నారు. ఇటువంటి హాస్టల్స్ లో ఉన్నవారు పెళ్లి చేసుకున్న తర్వాత.. తమ పాత సంబంధాలను కొనసాగిస్తున్నారు. దీంతో వైవాహిక జీవితంలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ తర్వాత అవి దారుణాతీ దారుణాలకు కారణమవుతున్నాయి. వాస్తవానికి ఈ సంస్కృతి మనది కాదు. ఎక్కడో విదేశాలలో ఇటువంటి కల్చర్ ఉంటుంది. మారిన పని విధానాల వల్ల ఇటువంటి సంస్కృతులు హైదరాబాద్ నగరానికి దిగుమతి అయ్యాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.