రహదా రి భద్రతపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబరు తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైన వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని కేంద్రం పేర్కొన్నది. వాహన రకాన్ని బట్టి రూ. 320 నుంచి రూ. 860 వరకు రుసుము చెల్లించాలని ఖరారు చేసింది. దీనికి సంబంధించి సెప్టెంబరు 30వరకు గడువు విధిం చారు. ఆ తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబరు లేని వాహనాలు రోడ్లపై తిరిగితే రవాణా శాఖ అధికా రులు జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినా నేటివరకు ఈ ప్రక్రియపై వాహనదా రులకు స్పష్టత కరవైంది. చాలా మందికి దీనిపై అవగాహన లేకపోవడం, ఉన్న వారు ఆన్‌లైన్‌లో చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తుండడంతో వాహనదా రులు ఆందోళనకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లోనే అనేక సమస్యలు ఉన్నాయని నమోదు చేసే అవకాశం ఉండడంలేదని వాహనాదారులు వాపో తున్నారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబరు విషయంపై రవాణా శాఖ అధికారులను సంప్రదించినా స్పష్టత ఇవ్వడంలేదని వాహనదారులు చెబుతున్నారు.
– వాహనదారుడే నేరుగా..
పాతవాహనానికి హైసెక్యూరిటీ నంబరు ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభు త్వం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్‌ఐఏఎం.ఇన్ వెబ్‌సై ట్ అందుబాటులో ఉంచింది. నిరక్షరాస్యులైన వాహ నాదారులకు ఈ వెబ్‌సైట్ పై అవగాహన లేకపో వడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవగాహన ఉన్న వారు సైతం అందులో వివరాలు నమో దు చేస్తే తీసుకోవడంలేదని పేర్కొంటున్నారు. ఇచ్చిన గడువు సమీపిస్తుండడం ఆన్‌లైన్ కాకపోవ డంతో వాహనదారులకు ఎటు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 30 తర్వాత వాహ నాలు రోడ్డెక్కితే చట్టపరమైన చర్యలుంటాయని రవాణా శాఖ అధికారులు హెచ్చరించడం హెచ్‌ఎస్‌ఆర్‌పీ చేయడానికి కేవలం ఐదు రోజులే గడువు ఉండ డంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నా రు. నిరక్షరాస్యులు, స్మార్ట్‌ఫోన్ లేని వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హెచ్‌ఎస్ ఆర్‌పీ కోసం జిల్లా కేంద్రంలోని ఏదైనా షోరూంల వద్ద ఆన్‌లైన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకో వాలని వాహనదారులు కోరుతున్నారు.
ఫ జిల్లాలో పాత వాహనాల వివరాలు..
ద్విచక్రవాహనాలు – 36,877
కార్లు 2,744
ట్రాక్టర్లు, ట్రైలర్లు 3,737
ఇతర వాహనాలు 496
ఫ చెల్లించే రుసుములు ఇలా..
వాహనం చెల్లించాల్సిన రుసుం
ద్విచక్రవాహనం స్వదేశీ 320- 360
ద్విచక్రవాహనం విదేశీ 400- 500
కార్లు స్వదేశీ 590- 700
కార్లు విదేశీ 700- 860
త్రిచక్ర వాహనం 350- 450
కమర్షియల్ వాహనాలు 600- 800
































