ఓట్స్ ఆరోగ్యానికి మంచివే.. వీరికి మాత్రం విషంతో సమానం.. తస్మాత్ జాగ్రత్త

ఓట్స్ లో అనేక పోషకాలున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకనే చాలా మంది తమ రోజుని ఓట్స్ తో రోజుని ప్రారంభిస్తారు. ఎందుకంటే ఓట్స్ చాలా ఆరోగ్యకరమైన అల్పాహారంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ని తినే ఆహారంలో భాగంగా చేర్చుకున్నారు. ఓట్స్ లో ఫైబర్, ప్రోటీన్ సహా ఆరోగ్యానికి మంచివిగా పరిగణించబడే ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఓట్స్ అందరికీ ప్రయోజనకరం కాదు. కొంతమంది ఓట్స్ హానికరం.

ఆరోగ్యకరమైన అల్పాహారం విషయానికి వస్తే.. నేటి జనరేషన్ కు మొదట గుర్తుకు వచ్చే పేరు ఓట్స్. జిమ్ కి వెళ్ళేవారి నుంచి డైట్ చేసే వారితో పాటు అందరూ ఓట్స్ ని బెస్ట్ ఫుడ్ గా భావించి తింటారు. ఓట్స్ ఆరోగ్య నిధి. ఓట్స్ బరువు తగ్గడానికి, గుండెను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. కానీ ‘ఆరోగ్యకరమైనది’గా పరిగణించబడే ఈ అల్పాహారం కొంతమందికి కూడా హానికరం అని మీకు తెలుసా? అవును ఓట్స్ అందరికీ ప్రయోజనకరం కావు .. ఓట్స్ తినడం వలన దుష్ప్రభావాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఓట్స్ ని తినొద్దు. లేకుంటే వీరు ప్రయోజనాలకు బదులుగా నష్టాలను చవిచూడాల్సి రావచ్చు.


జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు ఎవరైనా తరచుగా గ్యాస్, ఉబ్బరం లేదా అపానవాయువు వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. ఓట్స్ తినడం మంచిది కాదు. ఓట్స్‌లో చాలా ఫైబర్ ఉంటుంది. దీనిని జీర్ణం చేసుకోవడానికి కడుపు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఓట్స్ లోని ఫైబర్.. జీర్ణ సమస్యను మరింత పెంచుతుంది.

గ్లూటెన్ అసహనం ఉన్న వ్యక్తులు మార్కెట్లో లభించే చాలా ఓట్స్‌లో గ్లూటెన్ ఉంటుంది. ఎవరికైనా గ్లూటెన్ అలెర్జీ ఉన్నా లేదా సెలియాక్ వ్యాధితో బాధపడుతున్నా.. ఓట్స్ తినవద్దు. గ్లూటెన్ మీ జీర్ణవ్యవస్థలో మంటను కలిగిస్తుంది. అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఐరెన్ లోపం ఉన్న వ్యక్తులు ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇనుము శోషణను నిరోధించగలదు. మీ శరీరంలో ఇప్పటికే ఇనుము లోపం ఉంటే లేదా రక్తహీనతతో బాధపడుతున్నా.. ఓట్స్ తినడం వల్ల ఐరెన్ లోపం సమస్య మరింత తీవ్రమవుతుంది.

మూత్రపిండ వ్యాధి ఉన్న వ్యక్తులు మూత్రపిండ రోగులు తరచుగా భాస్వరం, పొటాషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పరిమితం చేయాలని సలహా ఇస్తారు. ఓట్స్ ఈ రెండు ఖనిజాలకు మంచి మూలం. కనుక మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు వైద్యుడిని సంప్రదించకుండా ఓట్స్ తినకూడదు.

ఓట్స్ మాత్రమే ఆహారంగా తీసుకునే వారు కొంతమంది ఓట్స్ మాత్రమే తినడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చని అనుకుంటారు. కానీ ఇది పెద్ద తప్పు. ఏదైనా ఒకే రకమైన ఆహారంపై ఆధారపడి ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఓట్స్ మాత్రమే తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ఖనిజాలు లభించవు. అప్పుడు శరీరం బలహీనతకు, అలసటకు గురవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.