ఓజీ కలెక్షన్ల జోరు.. 4వ రోజు పవన్ కళ్యాణ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ఓజీ. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధిస్తోంది.


కేవలం 3 రోజుల్లోనే 200 కోట్ల రూపాయల వసూళ్లతో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా నిలిచింది. ఓజీ స్పీడ్ చూస్తుంటే అలవోకగా 300 కోట్ల క్లబ్‌లో చేరేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4వ రోజు పవన్ కళ్యాణ్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

పవన్ వీరాభిమాని సుజీత్ .. ఓజీ చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.

ఓజీ బడ్జెట్ ఎంత?

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు.. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్

ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

ఓజీ మూడు రోజుల కలెక్షన్స్

ఓజీ కలెక్షన్స్ చూస్తే.. పెయిడ్ ప్రీమియర్స్‌తో 21 కోట్ల రూపాయలు, తొలి రోజు 64 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలు, మూడో రోజున 19 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూడు రోజుల్లోనే ఇండియా వైడ్ 130 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో పవన్ కళ్యాణ్ వీర విహారం చేస్తున్నారు. ఒక్క నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 4.7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 40 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ఓజీ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా మూవీస్ అధికారికంగా ప్రకటించింది. అలాగే యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రియా, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో మరో 35 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో పవన్ కళ్యాణ్ మూవీకి 75 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఓజీ చిత్రం మూడు రోజుల్లో 205 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వసూళ్లు

ఓజీకి ఆంధ్రా, నైజాంలలో తొలి రోజు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 21 కోట్ల రూపాయలు, తొలి రోజున 64 కోట్ల రూపాయలు, రెండో రోజున 20 కోట్ల రూపాయలు, మూడో రోజున 18 కోట్ల రూపాయలు చొప్పున ఓజీకి తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వరకు 127 కోట్ల రూపాయల గ్రాస్, 89 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో 36.50 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10.75 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 10 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 5.75 కోట్ల రూపాయలు, గుంటూరులో 8 కోట్ల రూపాయలు, కృష్ణాలో 6.75 కోట్ల రూపాయలు, నెల్లూరులో 3 కోట్ల రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ మూవీ రాబట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓజీ కలెక్షన్స్ చూస్తే.. కర్ణాటకలో 14 కోట్ల రూపాయలు, తమిళనాడు, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఓజీ.

ఓజీ నాలుగో రోజు వసూళ్లు

పవన్ కళ్యాణ్ పవర్‌ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు వీకెండ్ కలిసి రావడంతో ఆదివారం ఓజీకి తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్‌లో మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు డల్‌గా ఉన్న నార్త్ ఇండియాలోనూ వీకెండ్ టికెట్ బుకింగ్స్ బాగున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 33 శాతం, తమిళ్‌లో 14 శాతం, హిందీలో 7 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఓజీకి మరింత బుకింగ్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు ఓజీకి తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 50 లక్షల రూపాయలు, కర్ణాటకలో కోటి రూపాయలు, కేరళ + హిందీలో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. దాంతో నాలుగు రోజుల వరకు ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 230 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.