దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులకు మొత్తం 18 బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. ఈ డిసెంబర్‌లో క్రిస్మస్‌కు సాధారణ సెలవు ఉంటుంది. ఇతర రోజులలో వివిధ ప్రాంతీయ సెలవులు కూడా..
ప్రతి రోజు బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లేవారు చాలా మంది ఉంటారు. అయితే ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది రిజర్వ్ బ్యాంకు. ప్రతి రోజు బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు జరిపే వారు నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వచ్చే నెల డిసెంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్యాంకులకు మొత్తం 18 బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. ఈ డిసెంబర్‌లో క్రిస్మస్‌కు సాధారణ సెలవు ఉంటుంది. ఇతర రోజులలో వివిధ ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయి.
డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు జాబితా:
- డిసెంబర్ 1, సోమవారం: రాష్ట్ర అవతరణ దినోత్సవం (అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో సెలవు)
- డిసెంబర్ 3, బుధవారం: సెయింట్ జేవియర్ పండుగ (గోవాలో సెలవుదినం)
- డిసెంబర్ 7: ఆదివారం సెలవు
- డిసెంబర్ 12, శుక్రవారం: ప టోగన్ నెంగ్జింజ సంగ్మా పుణ్యతిథి (మేఘాలయ రాష్ట్రంలో సెలవుదినం)
- డిసెంబర్ 13: రెండవ శనివారం సెలవు
- డిసెంబర్ 14: ఆదివారం సెలవు
- డిసెంబర్ 18, గురువారం: ఉసోసో థామ్ పుణ్యతిథి (మేఘాలయ రాష్ట్రంలో సెలవు)
- డిసెంబర్ 19, శుక్రవారం: గోవా విముక్తి దినోత్సవం (గోవాలో సెలవు)
- డిసెంబర్ 20, శనివారం: లూసూంగ్, నామ్సూంగ్ పండుగ (సిక్కింలో సెలవు)
- డిసెంబర్ 21: ఆదివారం సెలవు
- డిసెంబర్ 22, సోమవారం: లుసూంగ్, నామ్సూంగ్ పండుగ (సిక్కింలో సెలవు)
- డిసెంబర్ 24, బుధవారం: క్రిస్మస్ ఈవ్ (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలలో సెలవు)
- డిసెంబర్ 25, గురువారం: క్రిస్మస్, అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
- డిసెంబర్ 26, శుక్రవారం: క్రిస్మస్ పండుగ సందర్శంగా(మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలలో సెలవు)
- డిసెంబర్ 27: నాల్గవ శనివారం సెలవు
- డిసెంబర్ 28: ఆదివారం సెలవు
- డిసెంబర్ 30, మంగళవారం: యు కియాంగ్ నంగ్బా పుణ్య తిథి (మేఘాలయలో సెలవు)
- డిసెంబర్ 31, బుధవారం: నూతన సంవత్సర వేడుక (మిజోరం, మణిపూర్‌లలో సెలవు)
సెలవు దినాల్లో బ్యాంకు కార్యాలయాలు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటుంది. చాలా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రజలు నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించవచ్చు. నగదు అవసరమైన వారి కోసం ATMలు తెరిచి ఉంటాయి. అయితే, చెక్కులు జారీ చేయడానికి, పెద్ద-విలువ RTGS లావాదేవీలు నిర్వహించడానికి వారు బ్యాంకులకు సందర్శించాల్సి ఉంటుంది.
































