భారతీయ రైళ్లలో కొత్త రూల్.. చూసి అవాక్కవుతున్న ప్రయాణికులు

మనం రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా రూల్స్ ఉంటాయి. వాటిని తప్పక పాటించాలి. లేదంటే.. రైల్వే చట్టం ప్రకారం శిక్షలు ఉంటాయి. ఈ రూల్స్ తరచూ మారుతూ ఉంటాయి. అలాంటి ఓ అప్‌డేట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


రైళ్లలో ప్రయాణించడం మనకు చాలా ఇష్టం. బస్సులో కంటే.. రైలులో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉంటాయి. ఐతే.. భారతీయ రైల్వే.. తరచూ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని రూల్స్ మార్చుతోంది. వాటిని మనం తెలుసుకుంటే, ఫాలో అయితే ఏ సమస్యా ఉండదు. కానీ రూల్స్‌కి వ్యతిరేకంగా చేస్తే, రైల్వే చట్టం ప్రకారం ఫైన్లు, జైలు శిక్షల వంటివి ఉంటాయి. అలాంటి మనకు లేకుండా చూసుకోవాలి. అందుకోసం కొత్త రూల్స్ తెలుసుకుంటే మంచిదే.

మనలో చాలా మంది రైలు ఎక్కాక.. ముందుగా చూసేది వారి సీటునే. తర్వాత.. మొబైల్ ఛార్జింగ్ సాకెట్‌ని చూస్తారు. వెంటనే ఛార్జర్‌ని దానికి సెట్ చేసి.. మొబైల్‌ని ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది తమ ల్యాప్‌టాప్‌లను ఓపెన్ చేసి.. అడాప్టర్ ద్వారా సాకెట్‌కి కనెక్షన్ ఇచ్చి.. ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటారు. ఐతే.. దక్షిణ పశ్చిమ రైల్వే.. ఈ సాకెట్ రూల్స్ మార్చింది. త్వరలో మిగతా రైళ్లలోనూ ఈ కొత్త రూల్స్ వచ్చే అవకాశం ఉంది.

కొత్త రూల్స్ ప్రకారం రైళ్లలో సాకెట్‌ని మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఛార్జ్ చెయ్యడానికి మాత్రమే వాడాలి. మరే ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఛార్జ్ చేసినా.. అది రైల్వే చట్టాల ప్రకారం నేరం అవుతుంది. సపోజ్ మనం ఓ పవర్ బ్యాంక్ లాంటిదో ఛార్జ్ చేస్తే, ఆ విషయం.. TTEకి తెలిస్తే.. నేరంగా పరిగణిస్తారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రైల్వే నోటీసును ఓ నెటిజన్.. నెట్‌లో పోస్ట్ చేసి.. ఈ కొత్త రూల్ ఏంటి అని ప్రశ్నించారు.

ఆ నోటీస్ ప్రకారం, రైళ్లలో సాకెట్లు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా పనిచేయకుండా ఉంటాయి. ఆ టైంలో ఛార్జింగ్ పెట్టుకున్నా.. ఛార్జ్ అవ్వవు. సేఫ్టీ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాబట్టి మనం రైలు ఎక్కినప్పుడు.. రాత్రివేళ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి రాకుండా.. ముందే ఛార్జ్ చేసుకోవాలి. 11 లోపు ఛార్జ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి.

నిజానికి మన రైళ్లలో ప్రయాణికులు ఎక్కువగా రాత్రివేళే ప్రయాణిస్తారు. మరి అప్పుడు సాకెట్లు పనిచెయ్యకపోతే ఇక వాటిని ప్రయాణికులు సరిగా ఉపయోగించుకోలేనట్లే. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే.. దానికి కూడా కారణం ప్రయాణికులే. చాలా మంది రాత్రిళ్లు ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారు. దాంతో.. షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం పెరుగుతోంది. అలాగే.. దొంగలు కూడా మొబైల్స్, ఛార్జర్లు ఎత్తుకుపోయేందుకు ఇదో అవకాశంగా మారుతోంది.

2021లోనే భారతీయ రైల్వే.. ఈ విధంగా రాత్రి చార్జింగ్‌ని నిషేధించే నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఈ నిబంధనలు అన్ని రైళ్లలో అమలులో ఉన్నాయి. దక్షిణ పశ్చిమ రైల్వే ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తూ, సాకెట్ల పక్కన స్పష్టమైన నోటీసులు అతికించడం మొదలుపెట్టింది. ఈ నిర్ణయంపై ప్రయాణికులు రకరకాలుగా స్పందిస్తున్నారు. తనకు రాత్రి 12 గంటల సమయంలో చార్జింగ్ ఆగిపోయిందని ఓ ప్రయాణికుడు తెలిపారు. మరికొందరు 2 ఏసీ, 3 ఏసీ కోచ్‌లలో ఎలాంటి సమస్యా లేదని తెలిపారు. దీన్-దయాళ్ కోచ్‌లలో మాత్రమే ఈ నిబంధనలు ఎక్కువగా అమలవుతున్నాయని కొందరు అభిప్రాయపడ్డారు.

భారతీయ రైళ్లలో చార్జింగ్ సౌకర్యాలు 2010ల నుంచి మెరుగయ్యాయి. కానీ ఇప్పటికీ సేఫ్టీ సమస్యలు తలెత్తుతున్నాయి. 110 వోల్ట్.. ఏసీ పవర్ సప్లై ఉన్నప్పటికీ, తక్కువ నాణ్యత చార్జర్లు వాడటం వల్ల హీటింగ్, అగ్ని ప్రమాదాల వంటివి జరుగుతున్నాయి. ఐతే.. ప్రయాణికులు మాత్రం ఎల్లప్పుడూ సాకెట్లు పనిచెయ్యాలని కోరుతున్నారు. ఈ రోజుల్లో ప్రయాణిస్తూ కూడా ఎన్నో పనులు ఆన్‌లైన్‌లో జరుగుతూ ఉంటాయనీ.. అందువల్ల సాకెట్లను ఆఫ్ చెయ్యవద్దని కోరుతున్నారు. రైల్వే అధికారులు మాత్రం.. పోర్టబుల్ పవర్ బ్యాంక్‌లు వాడమని సూచిస్తున్నారు.

రైల్వేల్లో పవర్ సేవింగ్ కోసం కూడా ఈ చర్య తీసుకుంటున్నారు. కంటిన్యూగా పవర్ వాడితే.. అది రైల్వేపై ఆర్థిక భారం కాగలదని అంటున్నారు. ప్రయాణికులు మాత్రం రైల్వే నుంచి మరిన్ని సౌకర్యాలు కావాలని కోరుకుంటున్నారు. స్మార్ట్ సాకెట్లు, టైమర్ ఆప్షన్లు, లేదా సేఫ్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. దక్షిణ పశ్చిమ రైల్వే నోటీస్ మనకు కూడా ఒక అలర్ట్ లాంటిదే. మనం రైళ్లలో వెళ్తున్నప్పుడు.. ఛార్జింగ్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.