వారందరికి డిసెంబర్ నుంచి పెన్షన్ నిలిపివేత

ప్రభుత్వ రంగ పింఛనుదారులకు బిగ్ అలర్ట్. తమ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ పత్రం) సమర్పించేందుకు ఇచ్చిన గడువు నవంబర్ 30, 2025తో ముగియనుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి దానిని పెన్షన్ పంపిణీ అథారిటీ ఆమోదం తెలిపితేనే వచ్చే నెల నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా పింఛన్ జారీ అవుతుంది.


గడువు లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పింఛనర్లకు డిసెంబర్ నెల నుంచి పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది.ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగ పెన్షనర్లు తాము జీవించే ఉన్నామని నిరూపించుకునేందుకు ప్రతి సంవత్సరం ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. జీవన్ ప్రమాణ్ పత్రం ఇచ్చిన వారికే పెన్షన్ లభిస్తుంది.

ఎవరైనా నవంబర్ 30వ తేదీలోపు జీవన్ ప్రమాణ పత్రం ఇవ్వకపోతే పెన్షన్ జారీలో జాప్యం లేదా తాత్కాలికంగా నిలిపివేస్ అవకాశాలు ఉన్నాయి. దీంతో పెన్షనర్లపై అనవసరమైన ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించడం చాలా సులభమైన ప్రక్రియ. ఇది ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సిస్టమ్. పెన్షనర్లు తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రాసెస్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికెట్‌ను జనరేట్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఫింగర్ ప్రింట్ లేదా కనుపాప స్కామ్ అవసరమవుతాయి. ఈ సర్టిఫికెట్ ఆటోమేటిక్‌గా పెన్షన్ జారీ అధికారులకు చేరుతుంది. నేరుగా ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. గడువు సమీపిస్తున్న క్రమంలో పెన్షనర్లు తమకు అనువైన మార్గం ద్వారా సర్టిఫికెట్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన గడువులోపు సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం, ఆమోదం పొందడం అనేది చాలా అవసరం.

ఆధార్ నంబర్, పెన్షన్ పంపిణీ సంస్థలు (బ్యాంకు లేదా పోస్టాఫీసు) వద్ద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్

పెన్షన్ కేటగిరీ, మొబైల్ నంబర్, పీపీఓ నంబర్

పెన్షన్ జారీ చేసిన అథారిటీ పేరు, పెన్షన్ పంపిణీ అథారిటీ పేరు

పెన్షన్ అకౌంట్ నంబర్ లేదా ఫింగర్ ప్రింట్, ఐరిస్

ఫేస్ అథెంటికేషన్ కోసం ఆడ్రాయిడ్ మొబైల్ వెర్షన్ 9 ఆపైన ఉన్న ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్

బయోమెట్రిక్ డివైజ్

ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ, వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అవసరమవుతాయి.

6 సింపుల్ స్టెప్స్‌లో సబ్మిట్ చేయొచ్చు

ముందుగా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్న ఆడ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ తీసుకోవాలి.

పెన్షన్ పంపిణీ సంస్థల వద్ద రిజిస్టర్ అయిన ఆధార్ నంబర్ దగ్గరుంచుకోవాలి.

ఫోన్ లో ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఆపరేటర్ అథెంటికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. పెన్షనర్ ఫేస్ స్కాన్ చేయాలి.

పెన్షనర్ వివరాలు ఎంటర్ చేయాలి.

స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో ఫోటో దిగి సబ్మిట్ చేయాలి.

ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత జీవన్ ప్రమాణ్ పత్రం లింక్ ఎస్ఎంఎస్ వస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.