Perfume, Deodorant : ఇటీవల కాలంలో ఆడ మగ అన్న తేడా లేకుండా శరీరంపై శ్రద్ధ పెరిగింది. అందరూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికే ఇష్టపడుతున్నారు.
ప్రజలు బయటకు కనిపించే చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రజల చర్యలతో కాస్మోటిక్ బిజినెస్ చాలా రెట్టు పెరిగింది. శరీర అలంకరణలో పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి శరీరం నుంచి విడుదల అయ్యే దుర్గంధాలను నిరోధిస్తాయి. ఇది చెమట వాసనను తొలగించి తాజా అనుభూతిని పెంపొందించడంలో సాయపడుతుంది. చాలా మంది ఖచ్చితంగా వాటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా వీటిలో ఏదో ఒకటి వాడాల్సిందే. ఈ రెంటిని ఉపయోగించని వారు ప్రస్తుతం లేదంటే అతిశయోక్తి కాదు.
పెర్ఫ్యూమ్, డియోడరెంట్ రెండూ సువాసన కోసం ఉపయోగిస్తారు. వేసవి కాలంలో కొంతమంది పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్‌ను రోజుకు 3 నుండి 4 సార్లు ఉపయోగిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు అధిక చెమట కారణంగా దాని ప్రభావం తగ్గుతుంది. అసలు రెండింటి మధ్య తేడా ఏమిటి.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. పెర్ఫ్యూమ్‌లో 15-30 శాతం ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇది ఎక్కువ కాలం వాసన ఉండేలా చేస్తుంది. డియోడరెంట్‌లో ఎసెన్షియల్ ఆయిల్స్ 1 నుండి 2 శాతం మాత్రమే ఉంటాయి. ఈ కారణంగా పెర్ఫ్యూమ్ సువాసన మరింత కఠినంగా ఉంటుంది. డియోడరెంట్లలో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు, సువాసనలు ఉంటాయి, ఇవి చెమట వాసనను నియంత్రించడంలో సహాయపడతాయి.
సువాసన పరంగా పెర్ఫ్యూమ్ డియోడరెంట్ల కంటే బలంగా , ఎక్కువ కాలం ఉంటాయి. డియోడరెంట్ సువాసన 4 గంటల పాటు ఉంటుంది. పెర్ఫ్యూమ్ సువాసన దాదాపు 12 గంటల పాటు ఉంటుంది. ఇది వర్తించే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. పెర్ఫ్యూమ్, డియోడరెంట్ రెండింటి పని సువాసనను అందించడం. కానీ వాటిని వర్తించే విధానంలో స్వల్ప వ్యత్యాసం ఉంది. పెర్ఫ్యూమ్‌లో పెద్ద మొత్తంలో కాన్సన్ ట్రేషన్ ఉంటుంది. పెర్ఫ్యూమ్ ను చర్మంపై నేరుగా వాడకాన్ని నివారించాలి. ఇది ఎల్లప్పుడూ బట్టలపై మాత్రమే వర్తించాలి. అండర్ ఆర్మ్స్ వంటి విపరీతమైన చెమట ఉన్న ప్రదేశాలలో డియోడరెంట్ వాడాలి. మీరు బహిరంగ ప్రదేశంలో ఉంటే, చెమట వాసన మిమ్మల్ని.. అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల ఎల్లప్పుడూ డియోడరెంట్ వాడాలి. ఈ రెండింటి ధరల్లో చాలా తేడా కనిపిస్తుంది. డియోడరెంట్ ధర తక్కువగా ఉంటుంది. అయితే పెర్ఫ్యూమ్ ధర ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో చాలా పెర్ఫ్యూమ్‌లు అందుబాటులో ఉన్నాయి.