Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Overdraft Facility: మనలో చాలా మంది తన అత్యవసరం డబ్బు అవసరాల కోసం పర్సనల్ లోన్స్ కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదిస్తుంటారు. అయితే బ్యాంకులు ఈ పర్సనల్ లోన్స్ పై భారీగా వడ్డీని వసూలు చేస్తుంటాయి.


ఈ క్రమంలో వీటి కంటే గోల్డ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వంటి ఇతర మార్గాల్లో లోన్ పొందటం తక్కువ వడ్డీ రేటుకే డబ్బు పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం OD ఫెసిలిటీని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి..?
దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్లకు ఓవర్డ్రాఫ్ట్(OD) సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఈ బ్యాంకులు కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఇవి కస్టమర్లకు తమ తక్షణ నగదు అవసరాలను తీర్చుకునేందుకు తోడ్పడతాయి.ఇదే క్రమంలో దేశంలోని అనేక బ్యాంకింగ్ సంస్థలు తమ ఖాతాదారులకు షేర్లు, బాండ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై ఓడీ ఫెసిలిటీని అందిస్తుంటాయి. ఇక్కడ ఉపయోగం ఏమిటంటే డ్రా చేసిన డబ్బుపై మాత్రమే వడ్డీ లెక్కిస్తాయి. అది కూడా డ్రాచేసిన రోజు నుంచి మాత్రమే వడ్డీ లెక్కించబడుతుంది.

ముందుగా బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందాలంటే అందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా అర్హులైన కస్టమర్లకు బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు ముందుగానే ఓడీ ఫెసిలిటీని అందిస్తుంటాయి. కస్టమర్లు ఈ సదుపాయం కోసం ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా బ్యాంకును సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రెండు రకాల ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాలు ఉంటాయి. మెుదటిది సెక్యూర్డ్ కాగా రెండవది అన్ సెక్యూర్డ్ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఇక్కడ సెక్యూర్డ్ ఓడీ సౌకర్యాన్ని అందించేందుకు.. వారి నుంచి సెక్యూరిటీగా షేర్లు, బాండ్స్, ఎఫ్డి, ఇల్లు, ఇన్సూరెన్స్ పాలసీ, జీతం లేదా తనఖా ఇవ్వడం ద్వారా బ్యాంక్ నుంచి ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తుంటాయి. అందించిన సెక్యూరిటీ ఆదారంగా ఓడీ ఎంత ఇవ్వాలనే నిర్ణయం ఆర్థిక సంస్థ చేతిలోనే ఉంటుంది.

దేశంలో చాలా బ్యాంకులు జీతం, ఎఫ్డికి బదులుగా ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని తీసుకోవడానికి ఎక్కువ డబ్బు ఇస్తాయి. పరిమితిని ఎక్కువగా ఇస్తుంటాయి. ఉద్యోగి పేమెంట్ హిస్టరీ బాగుంటే వారి జీతానికి 200 శాతం వరకు ఓడీ రూపంలో సౌకర్యాన్ని అందిస్తాయి. లేకపోతే సాధారణంగా బ్యాంకులు జీతంలో 50 శాతం మాత్రమే ఓవర్డ్రాఫ్ట్ ఇస్తాయి. ఇక్కడ బ్యాంకులు పేమెంట్ హిస్టరీతో పాటు, కస్టమర్ క్రెడిట్ స్కోర్ను సైతం పరిశీలనలోకి తీసుకుంటాయి.

ఇక్కడ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్తో పోలిస్తే ఓవర్డ్రాఫ్ట్ ద్వారా డబ్బు తీసుకోవడం చౌక. ఓవర్డ్రాఫ్ట్లో బ్యాంకులు ఇతర లోన్స్ కంటే తక్కువ వడ్డీని వసూలు చేస్తుంటాయి. ముందుగా అందించిన ఓడి లిమిట్లో డ్రా చేసుకున్న మెుత్తానికి, అలాగే వాడుకున్న సమయానికి మాత్రమే డబ్బుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే పర్సనల్ లోన్స్ విషయంలో అధిక వడ్డీతో పాటు.. ఆ లోన్ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించినందుకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యంలో వాస్తవానికి డబ్బు డ్రా చేసుకుని వినియోగించిన కాలానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.