భారీగా తగ్గనున్న పెట్రోల్, మద్యం రేట్లు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ 2.0 విధానం సెప్టెంబర్ 22 సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సంస్కరణల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఆదాయం మిగులుతుంది.


కొత్త జీఎస్టీ రేట్ల కారణంగా నిత్యావసరాల ధరలు తగ్గాయి. నిత్యావసరాలపై కేవలం 5 శాతం పన్ను మాత్రమే ఉంది. 12 శాతం ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను స్లాబ్ లోకి తీసుకొచ్చారు. అలాగే హెల్త్ ఇన్సురెన్స్, ఫార్మా ధరలు కూడా తగ్గాయి. అంతేకాక ఆటోమొబైల్స్, వాటి విడిభాగాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. దీనితో కార్లు, బైక్‌ ల ధరలు భారీగా తగ్గాయి. జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రావడంతో ఇలా దాదాపు 375 ఉత్పత్తులపై పన్నులు తగ్గాయి.

జీఎస్టీ విధానంలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు ఉన్న 4 శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండు శ్లాబులుగా మార్చింది. 5, 18 శాతం మాత్రమే ఉన్నాయి. నిర్మాణరంగం, ఆటోమొబైల్స్ ఇలా అనేక రంగాలకు బిగ్ రిలీఫ్ ను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ పెట్రోల్, డీజిల్ మాత్రం జీఎస్టీ నుంచి మినహాయించారు. దీనికి గల కారణాలు ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో అధిక పన్ను కలిగిన వస్తువుల్లో పెట్రోల్, డీజిల్ ఒకటి. ఈ పన్నుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. పెట్రోల్, డీజిల్ పై అటు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పన్ను విధిస్తోంది. ఈ రెండు పన్నులు కలిపి 100 శాతం దాటాయి. అయితే కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తమ పన్నులను తగ్గించుకునేందుకు సుముఖంగా లేవు. ఇదే విషయంపై ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తాము పెట్రోల్, డిజిల్ ను జీఎస్టీ సంస్కరణల్లో పొందుపరచలేదని తెలిపారు. లీగల్ గా తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సి ఉందని అన్నారు.

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఈ ఆదాయం మీదనే భారీగా ఆధారపడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ట్యాక్షేషన్ పాలసీ మీద రాష్ట్ర ప్రభుత్వాలు పట్టును కోల్పోతాయి. అలాగే రాష్ట్రాలకు మద్యం అమ్మకాల నుండి పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది. అంతేకాక మద్యంపై విధించే ఎక్సైజ్ సుంకం, వ్యాట్.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఉదాహరణకు గోవాలో ఎక్సైజ్ సుంకం 55 శాతం ఉంటే కర్ణాటకలో 80శాతం వరకు ఉంటుంది. ఈ క్రమంలోనే అనేక ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గినా పెట్రోల్, డీజిల్, మద్యం ధరలలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు ఉండదు. ఇక లగ్జరీ గూడ్స్ తో పాటు సిన్ గూడ్స్ అయిన టొబాకో, పాన్ మసాలా, హై ఎండ్ కార్లు, డ్రింక్స్ పై 40 శాతం పన్ను అలాగే కొనసాగనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.