ఏప్రిల్‌ నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్‌

ఈపీఎఫ్ఓ చందాదారులకు ఏప్రిల్‌ నెల నుంచి మరో వెసులుబాటు కలగనుంది. యూపీఐ విధానం ద్వారా నేరుగా ఖాతాదార్ల బ్యాంకు ఖాతాలో పీఎఫ్‌ సొమ్ము జమయ్యే సౌకర్యం కలగనుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.


దీంతో ఏటీఎంల ద్వారా సొమ్ము డ్రా చేసుకునే వీలు కలగనుంది. చందాదారులు పీఎఫ్‌ సొమ్ములో కొంత మొత్తాన్ని ఖాతాల్లో నిల్వ చేసుకొని, ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకునే విధంగా కేంద్ర కార్మిక శాఖ నూతన విధానాన్ని రూపొందిస్తోంది. పీఎఫ్‌ ఖాతాలోని సొమ్ము నేరుగా యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాకు జమయ్యేలా ఏర్పాటు చేసుకొని, తమ నచ్చిన అవసరాలకు వినియోగించుకోవచ్చు. డెబిట్‌ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి సొమ్ము తీసుకోవచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.