ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటం అనేది కామన్ అయిపోయింది. ఒక ఫ్యామిలీ భార్య భర్తలతో పాటు వాళ్లకు ఉన్న పిల్లలందరికీ ఒక్కొక్కరికీ ఒక్కో ఫోన్ ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ తో కేవలం కాల్స్ మాట్లాడటమే కాకుండా సినిమాలు చూడటం, పాటలు పాడటం, సోషల్ మీడియాను వినియోగించడం ఇలా అనేక పనుల కోసం వాడుతుంటారు. అయితే స్టార్ట్ ఫోన్‌లకు ప్రధానంగా ఎదురయ్యే సమస్య స్పీకర్ సరిగ్గా వినిపించకపోవడం. ఫోన్‌ను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కాబట్టి ఇంట్లో ఉన్న దుమ్ము దూళి స్పీకర్ లోకి వెళ్లి వినిపించకుండా అవుతుంది.
శబ్ధం రాకపోవడంతో వెంటనే ఫోన్ తీసుకుని రిపేర్ సెంటర్‌కు పరిగెత్తుతుంటారు. కానీ నిజానికి ఇంట్లోనే మనం దుమ్ము దూళిని వదిలించవచ్చు. మొదట స్పీకర్ సరిగ్గా వినిపించాలి అంటే తరచూ స్పీకర్ క్లీన్ చేస్తూ ఉండాలి. అలా క్లీన్ చేసే సమయంలో కచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అంతర్గత షాట్ సర్య్యూట్ అవ్వకుండా కాపాడుతుంది. తరవాత మీ పాత టూత్ బ్రష్ లేదా చిన్న పెయింటింగ్ బ్రష్ తో సున్నితంగా దుమ్మును తొలగించాలి. దుమ్ము తొలగించేటప్పుడు లోపల స్పీకర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం ద్వారా ఫోన్ స్పీకర్ క్లియర్ గా, ఎక్కువ శబ్దంతో అంతరాయం లేకుండా వినిపిస్తుంది.
































