Pichukalu : పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

Pichukalu : మన ఇంట్లోకి అనుకోకుండా కొన్నిసార్లు పక్షులు, కీటకాలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల కొన్నిసార్లు శుభం కలుగుతుంది. కొన్నింటిని మనం లక్ష్మీ ప్రదంగా భావిస్తాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఎటువంటి పక్షులు మన ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుంది… మన ఇంట్లోకి రాకూడనటువంటి పక్షులు ఏవి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిచుకుల మన ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా మంచి జరుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు.

పిచుకులు ఇంట్లోకి రావడాన్ని శుభ సూచకంగా భావించాలి. పిచుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ ప్రదం. పిచుకలు ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందని అర్థం. రెండు పిచుకలు ఇంట్లోకి వస్తే కళ్యాణం ఆ ఇంట్లో జరగబోతుందని లేదా సంతానం కలగబోతుందని అర్థం.
అలాగే కాకిని చూస్తే చాలా మంది భయపడిపోతుంటారు. కొందరు దీనిని అశుభంగా భావిస్తారు. కానీ కాకిని పితృ దేవతలకు ప్రతీకగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంటికి వస్తే చాలా మంచిది.

Related News

పెద్దలు ఆశ్వీరదించడానికి వచ్చారని భావించాలి. బయటకు వెళ్లినప్పుడు కాకి తల మీద తనిత్తే ఏదో ప్రమాదం జరగబోతుందని , ఏదో చెడు జరగబోతుందని అర్థం. ఇక మూడవ పక్షి గుడ్లగూబ.

దీనిని చూస్తేనే అందరూ భయపడి పోతుంటారు. చూడడానికి ఈ గుడ్లగూబ చాలా భయకరంగా ఉంటుంది. కానీ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే చాలా మంచిది. గుడ్లగూబ ఇంటికి వస్తే లక్ష్మీ రాబోతుందని అర్థం.

గుడ్లగూబ లక్ష్మీ దేవికి వాహనం కాబట్టి ఇది ఇంట్లోకి వచ్చిన శుభసూచకంగా భావించాలి. ఇక పాము ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులకు మానసిక వ్యధ ఎక్కువవుతుంది. ఏదో అశాంతి రాబోతుందని అర్థం.

కావున పాము ఇంట్లోకి రావడం అంత మంచిది కాదు. అలాగే కొండమిడతలు కానీ కందిరీగ వంటివి కానీ ఇంట్లోకి వస్తే చాలా శుభపద్రంగా చెప్పవచ్చు. కందిరీగలు వచ్చి ఇంట్లో గూడు కడితే చాలా మంచిది.

ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతం. కందిరీగలు కట్టిన గూడు మట్టితో బొట్టు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మానసిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే గోడలపై బల్లులు లేని ఇళ్లే ఉండదు. బల్లులు ఇంట్లో ఉండడాన్ని శుభసూచకంగా భావిస్తారు.

శాస్త్రీయంగానూ బల్లులు ఇంట్లో ఉండడం మంచిది. కంటి మిడతల గురించి అందరికి తెలిసే ఉంటుంది. వర్షాకాల సమయంలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ కంటి మిడతలు అనేవి ఇంట్లోకి రావడం శుభానికి సంకేతం.

పూలు ఎక్కువగా ఉన్న ఇండ్లల్లోకి సీతాకోక చిలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే ఇళ్లు పూల వనంలా ఆహ్లాదంగా మారిపోతుంది. ఇంట్లో ఉండేవారికి బాధలు తొలగిపోయి ఆనందంగా మారతారు.

సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీప్రదం. లక్ష్మీప్రదం అంటే డబ్బు ఒక్కటే కాదు సంతోషం, సంతానం, మనశాంతి. కరువు లేకుండా ఉండడం.

ఎవరి దగ్గర చేయిచాచకుండా ఉండడం. ఇవి అన్నీ కూడా లక్ష్మీతత్వాలే. సీతాకోక చిలుక ఇంట్లోకి వస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా తేలు, జర్రీ ఇంట్లోకి రావడం మంచి విషయం కానే కాదు.

ఇళ్లు శుభ్రంగా లేనప్పుడు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు తేలు, జర్రీలు ఇంట్లోకి వస్తాయి. వీటి వల్ల చెడే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు తేలు, జర్రులు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *