వైఫై రౌటర్ పక్కన ఈ వస్తువులను పెడితే నెట్ స్పీడులో భారీ తగ్గుదల

వైఫై రౌటర్ పక్కన కొన్ని వస్తువుల పెడితే స్పీడు భారీగా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి రౌటర్ పక్కన ఉండకూడని వస్తువులు ఏవో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.


నేటి జమానాలో దాదాపు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటోంది. నెట్ కనెక్షన్ అనేది నిత్యావసరంగా మారిపోయింది. అయితే, చాలా మంది ఇళ్లల్లో వైఫై వేగం ఆశించిన మేరకు లేక జనాలు అసంతృప్తికి లోనవుతుంటారు. అయితే, చాలా సందర్భాల్లో జనాలు తెలియక చేసే పొరాపాట్లే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ పొరపాట్ల వల్ల వైఫై సిగ్నల్స్‌కు అడ్డంకులు ఏర్పడి నెట్ స్పీడు తగ్గిపోతోందట.

రేడియో తరంగాల ద్వారా వైఫై సిగ్నల్స్ ప్రయాణిస్తాయి. తలుపులు, మందపాంటి క్యాబినెట్ గోడలు, భారీ ఫర్నీచర్ వంటివి ఈ సిగ్నల్స్‌కు ఆటంకాలు కలిగిస్తాయి. స్పీడు తగ్గేలా చేస్తాయి. కాబట్టి కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో వైఫై రౌటర్‌కు సమీపంలో ఉంచొద్దని నిపుణులు చెబుతున్నారు.

మైక్రోవేవ్ ఓవెన్ దాదాపు 2.4 గీగాహెర్ట్‌జ్ ఫ్రీక్వెన్సీతో తరంగాలను విడుదల చేస్తుంది. వైఫై సిగ్నల్స్ కూడా దాదాపు ఇదే రేంజ్‌లో ఉంటాయి. కాబట్టి రౌటర్ పక్కన మైక్రోవేవ్ ఉంటే వైఫైకి ఆటంకాలు ఏర్పడవచ్చు.

అక్వేరియంలు, లేదా నీరు భారీగా ఉన్న డ్రమ్‌లు రౌటర్ పక్కన ఉంటే వైఫై సిగ్నల్స్ బలహీనపడతాయి. రేడియో తరంగాలను నీరు గ్రహిస్తుంది. ఫలితంగా వైఫై సిగ్నల్స్‌లో శక్తి తగ్గి, స్పీడు నెమ్మదిస్తుంది.

ఇనుము వంటి ఖనిజాలు, స్టీల్, గాజు వస్తువులు కూడా వైఫై సిగ్నల్స్‌ను బలహీన పరుస్తాయి. వైఫై రౌటర్ పక్కన ఇవి ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి.

వైర్‌లెస్ హెడ్ ఫోన్స్, బ్లూటూత్ డివైజులు, కార్డ్‌లెస్ ఫోన్లు కూడా వైఫై సిగ్నల్స్‌కు ఆటంకాలు కలిగిస్తాయి. ఈ డివైజెస్ కూడా 2.4 హెర్ట్‌జ్ లేదా 5 హెర్ట్‌జ్ ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేయడంతో రౌటర్‌ పనితీరుకు ఆటంకాలు ఏర్పడతాయి

కాబట్టి, వైఫై స్పీడు ఎల్లప్పుడు గరిష్ఠ స్థాయిలో ఉండాలనుకుంటే రౌటర్‌ను ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. రౌటర్ చుట్టూ ఎలాంటి అడ్డంకులు లేకుండా జాగ్రత్త పడాలి. ఎలక్ట్రానిక్ డివైజులు, నీళ్లు, లేదా లోహంతో చేసిన వస్తువులు రౌటర్ దరిదాపుల్లో పెట్టకుండా ఉంటే వైఫై స్పీడు మీరు కోరుకున్నట్టు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుంది. మరి ఈ సూచనలను వెంటనే అమలు చేసి ఫుల్ స్పీడును ఎంజాయ్ చేయండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.