ఆర్థిక ఇబ్బందులతో మెరిట్ స్టూడెంట్స్ విద్యకు దూరమవ్వకూడదన్న సంకల్పంతో కేంద్రం తీసుకొచ్చిన పథకం పేరు ‘పీఎం విద్యాలక్ష్మి’. ఈ స్కీమ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఆర్థిక సమస్యలతో మెరిట్ విద్యార్థులు మెరుగైన చదువుకు దూరంకాకూడదన్న సంకల్పంతో కేంద్రం తీసుకొచ్చిన పథకం.. “పీఎం విద్యాలక్ష్మీ”! విద్యకు యాక్సెస్‌ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ స్కీమ్ వడ్డీ రాయితీలు, పూచీకత్తు లేకుండా రుణాలు, సరళీకృత ఆన్లైన్ అప్లికేషన్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పీఎం విద్యాలక్ష్మి- ఎవరి కోసం?
పీఎం-విద్యాలక్ష్మి పథకం దేశవ్యాప్తంగా టాప్ ర్యాంకింగ్ ఉన్నత విద్యా సంస్థల్లో (హెచ్ఈఐ) ప్రవేశం పొందే విద్యార్థుల కోసం ఉద్దేశించినది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. ఇది విద్యా- పరిశోధన పనితీరు ఆధారంగా సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది.
ఇక్కడ అడ్మిషన్ పొందాలి:
టాప్ 100లో లేదా నిర్దిష్ట కేటగిరీలు లేదా డొమైన్లలో ప్లేస్ పొందిన సంస్థలు.
101-200 ర్యాంకులు పొందిన రాష్ట్రస్థాయి హెచ్ఈఐలు.
అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు.
ఈ పథకం 860 టాప్ సంస్థలను కవర్ చేస్తుంది. తాజా ర్యాంకింగ్‌లను ప్రతిబింబించేలా జాబితాను ఏటా అప్డేట్ చేస్తారు.
పీఎం-విద్యాలక్ష్మి ఎలా పనిచేస్తుంది?
ఈ పథకం పూచీకత్తు లేదా హామీదారులు లేకుండా విద్యా రుణాలను అందిస్తుంది. ఇది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. రీపేమెంట్ భారాన్ని తగ్గించడానికి అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి:
క్రెడిట్ గ్యారంటీ: రూ .7.5 లక్షలలోపు రుణాలకు, ప్రభుత్వం 75% క్రెడిట్ గ్యారంటీని అందిస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులను ప్రోత్సహిస్తుంది.
వడ్డీ రాయితీ: ఏడాదికి రూ.8 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్న విద్యార్థులు రూ.10 లక్షలలోపు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీకి అర్హులు. మారటోరియం కాలంలో (రుణ చెల్లింపు నిలిపివేయసినప్పుడు, సాధారణంగా అధ్యయన సమయంలో) ఈ సబ్సిడీ వర్తిస్తుంది.
ఏడాదికి రూ.4.5 లక్షల వరకు సంపాదించే కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పథకాల కింద పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది.
పీఎం-విద్యాలక్ష్మి ఫీచర్స్..
సమ్మిళిత ఆర్థిక సహాయం:
ఈ పథకం విభిన్న ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థుల కోసం రూపొందించినది. ఇది తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారికి ప్రత్యేక ఆర్థిక మద్దతును అందిస్తుంది.
సరళీకృత డిజిటల్ ప్రక్రియ:
ఏకీకృత, స్టూడెంట్ ఫ్రెండ్లీ పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా రుణాలు, వడ్డీ రాయితీల కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. ఈ వ్యవస్థ పూర్తిగా డిజిటల్, పారదర్శకత, వినియోగాన్ని సులభతరం చేయడం కోసం రూపొందించినది. ఈ-వోచర్లు లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీస) వాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తారు.
ప్రొఫెషనల్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్:
ప్రభుత్వ లేదా ఉన్నత స్థాయి సంస్థల్లో టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద ప్రాధాన్యత లభిస్తుంది.
ఇది ఎందుకు ముఖ్యమైనది?
2024-2031 బడ్జెట్లో రూ.3,600 కోట్లు కేటాయించిన ఈ పథకం ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వృత్తి విద్యకు ఆర్థిక సహాయాన్ని అందించే సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ (సీఎస్ఐఎస్), క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్ (సీజీఎఫ్ఎస్ఈఎల్) వంటి ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలకు ఇది తోడ్పడుతుంది.
అధిక ట్యూషన్ ఫీజులు, పరిమిత రుణ లభ్యత వంటి కీలక అడ్డంకులను పరిష్కరించడం ద్వారా, అర్హులైన విద్యార్థులు ఉత్తమ విద్యావకాశాలను కల్పించడం పీఎం-విద్యాలక్ష్మి టార్గెట్. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా విద్యకు సమాన ప్రాప్యతను పెంపొందించే భారతదేశ దార్శనికతను కూడా ఇది బలోపేతం చేస్తుంది!