ముంబైకి చక్కర్లు కొట్టబోతున్న పాడ్ ట్యాక్సీలు.. వీటి ప్రత్యేకత ఏంటంటే?

ముంబై రోడ్లపై త్వరలో పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయి. కుర్లా మరియు బాంద్రా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికుల రవాణా కోసం వీటిని ప్రవేశపెడుతున్నట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.


బుల్లెట్ ట్రేన్ ర్వైల్వే స్టేషన్, కొత్త ముంబై మైకోర్టు భవనం నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రంగా రద్దీ ఏర్పడిందని అందుకే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గించడానికి పాడ్ ట్యాక్సీలు తీసుకువస్తున్నామని తెలిపారు.

దీంతో పాడ్ ట్యాక్సీలు అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకునేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పాడ్ ట్యాక్సీ అనేది ఒక పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ యంత్రాంగంలో భాగం. ఇది డ్రైవర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. మెట్రా మాధిరిగానే దీని కోసం కూడా ప్రత్యేకంగా ఎలివేటెడ్ ట్రాకులు ఉంటాయి. ఆ ట్రాక్ పైనే ఇవి నడుస్తాయి. ఇందులో పరిమితంగానే మనుషులు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

సాధారణ టాక్సీలు అయితే రోడ్డుపై ప్రయాణించాలి, వాటి వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతాయి. కానీ ఒక ట్రాక్ పై ఒకే పాడ్ టాక్సీ వెళుతుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు ఉండవు. దీంతో చాలా వేగంగా ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తాయి. ఇవి పెద్ద పెద్ద క్యాంపస్ లలో, పట్టణ కేంద్రాల్లో ఉపయోగించడానికి వీలుగా ఉంటాయి. వీటిలో 2 నుండి ఆరు గురు ప్రయాణించవచ్చు. విద్యుత్ శక్తితో ఇవి పనిచేయడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. జీపీఎస్, సెన్సార్ల ఆధానంగా ఇవి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.