వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్.. కన్ఫ్యూజ్ అవుతున్న నిర్మాతలు

ప్రభాస్ కన్ఫ్యూజ్ అవుతున్నారా లేదంటే ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? అదీ కాదంటే ఒకరితో మరొకరికి అస్సలు కోఆర్డినేషన్ లేదా..? ఈ అనుమానం ఇప్పుడెందుకొచ్చిందబ్బా.. అసలు ప్రభాస్ విషయంలో జరుగుతున్న ఆ కన్ఫ్యూజన్ ఏంటి అనుకుంటున్నారు కదా..? మీకెందుకు ఆ ఆలోచన.. పదండి హాయిగా ఎక్స్‌క్లూజివ్‌లో మాట్లాడుకుందాం..

సినిమాలు అనుకున్న టైమ్‌కు వచ్చినా.. రాకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో మాత్రం ప్రభాస్ ఒక్కరే. సెట్స్‌పై 2.. లైన్‌లో 3 ప్రాజెక్ట్స్‌తో ఎవరికీ దొరకనంత బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. అయితే వీటి లైనప్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా ఏది ముందు.. ఏది తర్వాత అనే లెక్కల్లో మేకర్స్ మధ్య క్లారిటీ మిస్ అవుతుంది.


కరోనా తర్వాత ఒకే సమయంలో రాధే శ్యామ్, సలార్, కల్కి, ఆదిపురుష్ సినిమాలకు సైన్ చేసారు ప్రభాస్. అవి సెట్స్‌పై ఉన్నపుడు డేట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసారు రెబల్ స్టార్. రిలీజ్ డేట్స్ దగ్గర కూడా క్లాష్ వచ్చింది.

అందుకే కల్కి విడుదలయ్యాక.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అని డిసైడ్ అయిపోయి కొన్నాళ్ళుగా హను రాఘవపూడి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఒకే సినిమా చేయాలనుకున్నా.. ఫౌజీతో పాటే రాజా సాబ్‌కు కూడా ప్రభాస్ డేట్స్ చేయక తప్పట్లేదు.

ఈ కన్ఫ్యూజన్ ఇక్కడితో చాలు.. ఇకపై ఒక్కసారి ఒక్క సినిమానే అంటున్నారీయన. కానీ ఈ విషయంలో దర్శక నిర్మాతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే మొన్న కల్కి 2 సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని అశ్వినీదత్ చెప్తే.. తాజాగా స్పిరిట్ కూడా అప్పుడే అంటున్నారు నిర్మాతలు.

కల్కి 2 షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలుపెట్టి.. 2026 సమ్మర్‌కి విడుదల చేస్తామని చెప్పారు అశ్వినీదత్. తాజాగా సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ వంగా తమ స్పిరిట్ కూడా సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుందంటున్నారు. మరి ఈ 2 సినిమాల్లో ప్రభాస్ దేన్ని ముందు సెట్స్‌పైకి తీసుకొస్తారు..? అసలు సెప్టెంబర్‌లోపు సెట్స్‌పై ఉన్న ఫౌజీ, రాజా సాబ్ పూర్తవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.