ఇంట్లో శుభకార్యం ఏదొచ్చినా.. పండుగ ఏదైనా.. మహిళలకు బంగారం కొనాల్సిందే. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయ్ తప్పితే.. కిందకు దిగిరావట్లేదు.
ఇప్పటికే 24 క్యారెట్ల గోల్డ్ రేటు లక్ష దాటగా.. ఇప్పుడిప్పుడే బంగారం నేలచూపులు చూస్తోంది. గడిచిన ఐదు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు సుమారు రూ. 1920 మేరకు తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1760 మేరకు తగ్గింది. అటు స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు కూడా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. సుమారు రూ. 2100 మేరకు వెండి ధర దిగొచ్చింది. మరి దేశంలోని పలు నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
బంగారం ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,540గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93.090గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,390 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,940గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,01,390గా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,940గా ఉంది.
వెండి ధరలు ఇలా..
దేశంలో వెండి ధరలు ప్రస్తుతం రూ. 2100 మేరకు తగ్గాయి. ప్రధాన నగరాల్లో ఇలా ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, పూణేలో కేజీ వెండి ధర రూ. 1,14,900గా ఉంది. అలాగే హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,24,900గా కొనసాగుతోంది. కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ రేట్స్ కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
































