ప్రధాని మోదీ. వయసు 75 సంవత్సరాలు. అయితే, మోదీ ఎనర్జీ లెవల్స్ చూసిన వారు మాత్రం ఖచ్చితంగా దాని వెనుక రహస్యం ఏంటనేది ఆలోచిస్తారు. ఈ వయసులోనూ ఏ మాత్రం అలిసి పోయినట్లు కనిపించరు.
చాలా ఫిట్ గా ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం మోదీ క్రమశిక్షణా యుతమైన జీవన శైలి. ఈయన ఒక్కరోజు కూడా హాస్పిటల్ బెడ్ పై ఉన్న దాఖలాలు లేవు. మోదీ సక్సెస్ వెనుక ఈ ఫిట్‌నెస్ మంత్రా ప్రధానం. మోదీ ఎనర్జీ సీక్రేట్స్ చూస్తూ ఆశ్చర్య పోవాల్సిందే..
ప్రధాని మోదీ తన దిన్య చర్చ ప్రణాళికా బద్దంగా అమలు చేస్తారు. ప్రతిరోజూ 40 నిమిషాలు యోగా, ధ్యానం, ప్రాణాయామం, యోగ నిద్ర చేస్తారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చేసే పనులపై ఫోకస్ గా ఉంటారు. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు యోగా నిద్ర చేస్తారు. అలాగే మోదీ ఎక్కువ నడవడానికి ప్రిఫర్ చేస్తారు. గడ్డిపై చెప్పులు లేకుండా కూడా నడుస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేద మెడిసిన్స్ ఉపయోగిస్తారు.
తీసుకునే ఫుడ్ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. మోదీ తన ఆహారంలో మునగాకు ప్రాధాన్యత ఇస్తారు. పరాఠాల రూపంలో తీసుకుంటారు. కనీసం వారంలో రెండుసార్లు దీనిని తీసుకుంటారట. దీనిద్వారా ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. బీటా కెరోటిన్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, పొటాషియం కూడా అందుతాయి. కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. బీపీ, షుగర్ కూడా కంట్రోల్ అవుతాయి.
కాగా, మోదీ తన ఆహారంలో కిచిడి ఎక్కువగా తీసుకుంటారు. తనకు చాటా ఇష్టమంటూ అనేక ఇంటర్వ్యూల్లో తెలిపారు. అందుకే ఆయన మెనూలో ఇది కూడా ఉంటుంది. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, మిల్లెట్స్ మోదీ డైట్ లో ఉంటాయి. స్పైసీ లేని.. తేలికగా జీర్ణమయ్యే బ్యాలెన్స్డ్ ఫుడ్స్ నే మోదీ ఎక్కువగా తీసుకుంటారు. నచ్చిన ఆహారాన్నిని మెచ్చిన కొలతల్లో తీసుకుని.. హెల్తీగా, ఫిట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు మోదీ.
ఏ విషయంలో అయినా మోదీ ఎక్కువగా మధన పడకుండా పరిష్కారం మాత్రమే ఆలోచన చేస్తారు. వాస్తవిక ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ పర్యటనలో ఉన్నా తన దిన చర్యలో మాత్రం మార్పు లేకుండా వ్యవహరిస్తారు. యోగా ఖచ్చితంగా చేయాల్సిందే. అదే విధంగా నవరాత్రుల సమయంలో మోదీ కేవలం నిమ్మరసం తీసుకుంటూ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. తొలి నుంచి ఇలాంటి జీవన శైలి కొనసాగించటం ద్వారా మోదీ ఇంత ఫిట్ గా ముందుకు సాగుతున్నారు.



































