‘మన శంకర వరప్రసాద్ గారు’ లో వెంకటేష్ రెమ్యూనరేషన్ పై నిర్మాత సుష్మిత

‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankar Varaprasad Garu) చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjevi) వన్ మ్యాన్ షోని చూసి అభిమానులు ఎంతలా మురిసిపోయారో మనమంతా చూసాము.

డ్యాన్స్, కామెడీ టైమింగ్, సెంటిమెంట్, ఫైట్స్ ఇలా ప్రతీ అంశం లోనూ పాత కాలం లో తాము ఎంతగానో ఇష్టపడిన మెగాస్టార్ ని మరోసారి వెండితెర పై చూపించాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి నటన చాలా పెద్ద ప్లస్ అయ్యింది, అదే విధంగా ఇందులో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) పాత్ర కూడా ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి బాగా ఉపయోగపడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్ కి వెళ్ళింది. చిరంజీవి, వెంకటేష్ ని అలా వెండితెరపై ఒక ఫ్రేమ్ లో చూసేసరికి ప్రేక్షకులకు, అభిమానులకు రెండు కళ్ళు చాలలేదు.


అయితే ‘గాడ్ ఫాదర్’ లో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేసినందుకు నయా పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. ఇందులో వెంకటేష్ కూడా కేవలం పది నిమిషాల పాత్ర మాత్రమే చేసాడు కాబట్టి, ఆయన కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గా జరిగిన ఆ చిత్ర నిర్మాత సుష్మిత కొణిదెల ఇంటర్వ్యూ ని చూసిన తర్వాత తెలిసింది. ఆమె మాట్లాడుతూ ‘వెంకటేష్ గారి రెమ్యూనరేషన్ విషయం లో ఎలాంటి వాదనలు జరగలేదు. ఆయన కోరినంత ఇచ్చాము. సినిమాకు ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణ, ఆయన ఎంట్రీ తర్వాత ఆడియన్స్ ఈ చిత్రానికి ఇంకా ఎక్కివ్ కనెక్ట్ అయ్యారు. ఆయనకు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలన్నా మాకు ఆనందమే. వ్యక్తిగతంగా వెంకటేష్ గొప్ప పాజిటివ్ మనిషి. సెట్స్ లో ఆయన చిరంజీవి గారితో ఉన్నన్ని రోజులు నవ్వులే నవ్వులు’ అంటూ చెప్పుకొచ్చింది సుష్మిత.

వెంకటేష్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చాను అనేది అధికారికంగా చెప్పలేదు కానీ , అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ఆయన ఈ సినిమాలో నటించినందుకు గాను 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ రేంజ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. నేడు నారా రోహిత్ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టగా, ఆయనపై మరియు ఇతర తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.