ఏపీకి రెయిన్ అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

 ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనావేసింది. వాయివ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.


దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురుస్తాయని పేర్కొంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అప్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయివ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ అంచనావేసింది. వచ్చే నాలుగు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.