Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించింది.
ఈ పథకం కింద గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది. మార్గదర్శకాలు ఇవీ.
అర్హతలు:
నివాసం: దరఖాస్తుదారుడు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
వయస్సు:
వ్యవసాయేతర ప్రాజెక్టులకు 21-55 సంవత్సరాలు.
వ్యవసాయం మరియు సంబంధిత రంగాలకు 21-60 సంవత్సరాలు.
ఆదాయ పరిమితి:
గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.1,50,000.
పట్టణ ప్రాంతాల్లో (మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) సంవత్సరానికి రూ.2,00,000.
సామాజిక వర్గం: SC, ST, BC, మైనారిటీ, EBC/EWS వర్గాలకు చెందినవారు అర్హులు.
ఆర్థిక సహాయం నమూనా:
రూ.50,000 వరకు: 100% రాయితీ.
రూ.50,001 – రూ..1 లక్ష: 90% రాయితీ, మిగిలిన 10% బ్యాంకు రుణం ద్వారా.
రూ. 1,00,001 – రూ..2 లక్షలు: 80% రాయితీ, 20% బ్యాంకు రుణం.
రూ. 2 లక్షలు – రూ..4 లక్షలు: రాయితీ శాతం తగ్గుతూ, మిగిలిన మొత్తం బ్యాంకు రుణం లేదా లబ్ధిదారుడి సొంత భాగస్వామ్యంతో.
అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు.
రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం.
కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేసినది).
డ్రైవింగ్ లైసెన్స్ (ట్రాన్స్‌పోర్ట్ రంగ పథకాలకు).
పట్టాదార్ పాస్‌బుక్ (వ్యవసాయ పథకాలకు).
SADAREM ధ్రువీకరణ పత్రం (వికలాంగులకు)
దరఖాస్తు ప్రక్రియ:
అధికారిక వెబ్‌సైట్‌లో (tgobmms.cgg.gov.in) ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 5, 2025.
సహాయం కోసం సేవా కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది.
ఎంపిక మరియు అమలు:
జిల్లా స్థాయి కమిటీ (DLC) ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
జిల్లా కలెక్టర్ అనుమతితో స్వీకృతి లేఖలు జారీ చేస్తారు.
లబ్ధిదారులకు జూన్ 2, 2025 (తెలంగాణ ఆవిర్భావ దినం) నుంచి ఆర్థిక సహాయం అందజేస్తారు.
శిక్షణ మరియు పర్యవేక్షణ కోసం వివరణాత్మక ప్రణాళిక ఉంటుంది.
ఇతర విశేషాలు:
లబ్ధిదారుడు తనకు నచ్చిన, ఆర్థికంగా లాభదాయకమైన ఏదైనా కార్యకలాపాన్ని ఎంచుకోవచ్చు.
మొత్తం బడ్జెట్ రూ.6,000 కోట్లు, 5 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యం.
ఈ పథకం ద్వారా తెలంగాణ యువతకు ఆర్థిక స్వాతంత్య్రం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం ప్రభుత్వ ఉద్దేశం. మరిన్ని వివరాల కోసం అధికారిక పోర్టల్‌ను సందర్శించండి.