Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టబడ్డ తెలుగు సినీ ప్రముఖులు.
ఇది తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసే బ్రేకింగ్ న్యూస్.. బెంగళూరులో జల్సా చేస్తూ పట్టుబడ్డ 100 మందికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్.. ఈ పార్టీకి పలువురు లీడర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు బెంగళూరు మీడియా రిపోర్ట్ చేస్తోంది.
బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. G.R ఫామ్‌హౌస్‌లో తెల్లవారుజాము 3గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి 100 మందికి పైగా హాజరయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు చెబుతున్నారు.
GR ఫామ్‌హౌస్.. అంటే గోపాల్‌రెడ్డి ఫామ్‌హౌస్..? కాన్ కార్డ్ యజమాని గోపాల్‌రెడ్డి.. ఈయన ఫామ్‌హౌస్‌లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది..? తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి..? పుట్టినరోజును ఇంత గ్రాండ్‌గా ఎందుకు ప్లాన్ చేశారు..? 100 మందిని పిలిచారు.. ఇందులో VVIPలు, సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానికిక్ సిటీ పోలీసులు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేసింది.
ఈ రేవ్ పార్టీకి హైఎండ్, పోష్ కార్లు చాలా వచ్చాయ్. వాటిల్లో ఓ బెంజ్ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దానికి కారణం.. ఆ కార్‌పై ఏపీ MLA కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్టిక్కర్ ఉంది. దీనిపై టీవీ9 ప్రతినిధి ఎమ్మెల్యే కాకాణిని కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ కారుతో తనకు ఎలంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కారు తనది కాదని.. తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు.
రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టు చెప్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్కులేట్ అవుతోంది. దీనిపై క్లారిటీ కోసం టీవీ9 రిపోర్టర్ హేమను కాంటాక్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ ఛానెల్స్‌లో, మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు.