నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు ఉచితంగా అందుకోండి

బిఎస్ఎన్ఎల్ 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కొత్త ఆఫర్ అందించింది. ఈ కొత్త ఆఫర్ ఏమిటంటే, కొత్త యూజర్లకు ఉచిత SIM తో పాటు ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

దేశంలో టారిఫ్ రేట్లు పెరుగుతుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉచిత లాభాలు అందుకునే ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటిస్తోంది. మరి బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ బెస్ట్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందామా.


BSNL Best Offer

2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఆఫర్ అందించినట్లు బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. వాస్తవానికి, ఇది చాలా నెలలుగా వస్తున్న బెస్ట్ ఆఫర్ మరియు లిమిటెడ్ పీరియడ్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క 1 రూపాయి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఆఫర్. ఈ కొత్త ఆఫర్ 2025 డిసెంబర్ 31 తో ముగియగా 2026 కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఆఫర్ గడువును పొడిగించింది. ఇప్పుడు ఈ ఆఫర్ 2026 జనవరి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

BSNL Best Offer : ప్రయోజనం ఏమిటి?

కొత్త కనెక్షన్ తీసుకునే కస్టమర్లను ఆకర్షించేందుకు బిఎస్ఎన్ఎల్ అందించిన బెస్ట్ ప్లాన్ ఈ రూ. 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్. ఈ ఆఫర్ కేవలం కొత్త SIM కార్డు తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ తీసుకునే వారికి ఉచిత సిమ్ కార్డు కూడా బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది.

ఇక ఈ ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ఒక్క రూపాయి రీఛార్జ్ ప్లాన్ తో 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హాయ్ స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వచ్చే డైలీ లిమిటెడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఇది టెలికాం ఇండస్ట్రీ మొత్తం మీద బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ మాదిరిగా చాలా చవక ధరలో మరిన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ ఇంకా ఉన్నాయి. ఇందులో రూ. 153 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గా ఉంటుంది. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 154 రూపాయల ఖర్చులో 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1జీబీ హాయ్ స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ అందించే 1జీబీ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.