రికార్డు స్థాయిలో చీరమేను ధర.. పోటెత్తిన మాంసాహార ప్రియులు

దీపావళి రోజుల్లో గోదావరి, సముద్ర సంగమ ప్రాంతంలో లభించే అరుదైన చేప చీరమేను. దీనిని కొనుగోలు చేసేందుకు శుక్రవారం యానాంకు మాంసాహార ప్రియులు పోటెత్తారు. దీంతో సెరు చీరమేను ధర రూ. 16 వేల వరకు పలికింది. పెద్దదారం సైజులో ఉండే చీరమేనును మత్స్యకారులు లీటర్ల లెక్కన విక్రయిస్తారు.తూర్పు గాలులు వీచే వేళ.. సముద్రం, గోదావరి నది కలిసే ప్రాంతంలో ఇది లభిస్తుంది. ఈ సమయంలో నీటి అడుగు భాగం నుంచి అవి నీటిపైకి చేరుకొంటాయి. ఈ చీర మేనను ఈ రోజు మత్స్యకారులు భారీగా మార్కెట్‌కు తీసుకు వచ్చారు. దాంతో స్థానిక రాజీవ్ బీచ్‌లోని పుష్కర్ ఘాట్ వద్ద సందడి వాతరవరణం నెలకొంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.