వాతావరణం చల్లగా మారిన వేళ చాలా మందికి వేడి వేడిగా ఏదైనా సూప్ తాగాలనిపిస్తుంది. అందులోనూ నాన్‌వెజ్‌తో చేసే సూప్లైతే చిన్నా, పెద్దా అందరూ భలే ఇష్టంగా తాగుతుంటారు. ఇప్పుడు మీకోసం అలాంటిదే ఒక సూపర్ సూప్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, నోరూరించే కమ్మని “చికెన్ సూప్“. నోటికి ఏమి రుచించనప్పుడు ఇలా దీన్ని ప్రిపేర్ చేసుకొని తాగారంటే మంచి టేస్ట్‌ని ఆస్వాదిస్తారు. ఈ పద్ధతిలో చేసుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్లో భలే కమ్మగానూ ఉంటుంది. పైగా దీని కోసం ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన పని లేదు. కుక్కర్లో అప్పటికప్పుడు చాలా తక్కువ టైమ్‌లో సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి, ఇంతకీ చికెన్ సూప్‌ని ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
అవసరమైన పదార్థాలు :
- చికెన్ – 200 గ్రాములు(విత్ బోన్స్)
- రెండు టీస్పూన్లు – నెయ్యి/నూనె
- ఒకటి – బిర్యానీ ఆకు
- రెండు – యాలకులు
- మూడు – లవంగాలు
- చిన్న ముక్క – దాల్చిన చెక్క
- రెండు – ఉల్లిపాయలు
- ఒక టీస్పూన్ – పసుపు
- రుచికి సరిపడా – ఉప్పు
- కొద్దిగా – అల్లం
- పది నుంచి పన్నెండు – వెల్లుల్లి రెబ్బలు
- ఒకటీస్పూన్ – మిరియాలు
- కొద్దిగా – నిమ్మరసం
- సన్నని కొత్తిమీర తరుగు – కొద్దిగా
- పుదీనా ఆకులు – కొన్ని
-
తయారీ విధానం :
- కమ్మని చికెన్ సూప్ తయారీ కోసం ముందుగా అందులోకి అవసరమైన ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, చికెన్‌ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు రెసిపీలోకి ప్రధానమైన ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీర పేస్ట్ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి.
- ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా సన్నని అల్లం తరుగు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తురుము, ముందుగా కట్ చేసుకున్న దాంట్లో ఒక ఉల్లిపాయ ముక్కలు, మిరియాలతో పాటు ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.
- ఒకవేళ ఈ కొత్తిమీర పేస్ట్‌లో మీరు కావాలనుకుంటే ఒక టీస్పూన్ చొప్పున జీలకర్ర, ధనియాలనూ యాడ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు చికెన్ సూప్ తయారీ కోసం స్టవ్ మీద కుక్కర్ ఉంచి నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్కతో పాటు యాలకులను కాస్త ఓపెన్ చేసి వేసుకొని వేయించాలి.
- ఆ ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత అందులో మిగిలిన సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఆనియన్స్ కాస్త సాఫ్ట్‌గా మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే కొన్ని క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు.
- ఆనియన్స్‌ని వేయించుకునే క్రమంలో అందులో కాస్త పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం ద్వారా సూప్‌కి అదనపు రుచి వస్తుంది.
- ఉల్లిపాయ ముక్కలు మగ్గాయనుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని లో ఫ్లేమ్‌లో ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి.
- అలా వేయించుకునే క్రమంలో ఆ మిశ్రమంలో రుచికి తగినంత సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి.
- చికెన్ కాస్త వేగిందనుకున్నాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మరికాసేపు ఆ మిశ్రమాన్ని మగ్గనివ్వాలి. ఇలా చేయడం ద్వారా ఇంగ్రీడియంట్స్లో ఉండే పచ్చివాసన పోతుంది.
- తర్వాత ఆ మిశ్రమంలో రెండు గ్లాసుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలపాలి. ఆపై ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి.
- అనంతరం కుక్కర్ మూతపెటి మీడియం ఫ్లేమ్‌లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా కమ్మని “చికెన్ సూప్” మీ ముందు ఉంటుంది!
































