స్మార్ట్‌ఫోన్‌లతోపాటు జియో ఫోన్, జియో భారత్ ఫోన్‌ల కోసం కూడా ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ లు ఉన్నాయి. జియో భారత్ ఫోన్‌ల కోసం ప్రస్తుతం 4 రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లు ఉన్నాయి.
రీఛార్జ్ ప్లాన్‌లు :
ఈ జాబితాలో రూ.123, రూ.234, రూ.369, రూ.1234 వంటి రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు జియో భారత్ ఫోన్ లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల పూర్తి కాలింగ్, డేటా, SMS, వ్యాలిడిటీ ప్రయోజనాలు.
రూ.123 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయాన్ని పొందవచ్చు. మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 0.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
అంటే ఈ ప్లాన్ లో (Jio Rs123 Recharge plan) మొత్తంగా 14GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో టీవీ యాప్ తోపాటు Jiosaavn సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.
రూ.234 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 0.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. ప్రతి 28 రోజులకు 300 SMS లను వినియోగించుకోవచ్చు.
అంటే ఈ ప్లాన్ లో (Jio Rs234 Recharge plan) మొత్తంగా 600 SMS, 28GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో టీవీ యాప్ తోపాటు Jiosaavn సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.
రూ.369 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 0.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ప్రతి 28 రోజులకు 300 SMS లను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ లో ( Jio Rs369 Recharge plan ) మొత్తంగా 900 SMS, 42GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు జియో టీవీ యాప్ తోపాటు Jiosaavn సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.
రూ.1234 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రోజువారీ 0.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. ప్రతి 28 రోజులకు 300 SMS లను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ లో ( Jio Rs1234 Recharge plan ) మొత్తంగా 168GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు 3600 SMS లను పొందవచ్చు. దీంతోపాటు జియో టీవీ యాప్ తోపాటు Jiosaavn సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు.



































