ఒక్కొక్కరి ఖాతాలో రూ. 18,500, 15,000 .. మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా.. లేదా..?

చాలా వరకు రాష్ట్రాల్లో నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈతరహా పథకాలు అమలు చేస్తోంది. కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్‌లో భాగంగా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అనేక నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయి. 2019 ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నవ రత్నాల పేరుతో అనేక నగదు బదిలీ పథకాలు ప్రారంభించారు. వీటి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో.. ఆయా పథకాలకు సంబంధించిన నిధులను జమ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో వారు ఒక్కొక్కరి ఖాతాలో 18,500, 15 వేల రూపాయలు జమ చేసింది ప్రభుత్వం. ఆ వివరాలు..


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. అనేక నగదు బదిలీ పథకాల అమలు ఆగిపోయింది. ఇక గత సోమవారం అనగా.. మే 13న పోలింగ్‌ ముగియడంతో.. ఆ పథకాల నిధులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళలకు, రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం, చేయూత, ఆసరా పథకాల నిధులను జమ చేసింది. దీనిలో భాగంగా వారి ఖాతాలో18,.500, 15 వేల రూపాయలు జమ అయ్యాయి.

ఏపీలో అగ్రవర్ణాలలోని పేద మహిళలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకానికి సంబంధించి ఈ ఏడాది మార్చి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కినా.. లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాలేదుకాలేదు. అయితే పోలింగ్‌కు ముందు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాలని భావించినా ఈసీ అనుమతించలేదు. దాంతో పోలింగ్‌ ముగిసిన తర్వాత అనగా తాజాగా ఈబీసీ నేస్తం కింది అర్హులైన మహిళల అకౌంట్‌లలో రూ.15వేల చొప్పున జమ చేశారు.

ఈ పథకంతో పాటు.. వైఎస్సార్‌ చేయూత కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన మహిళలకు జగన్‌ సర్కార్‌ ఏడాదికి రూ.18,750 అందిస్తోంది. దీనిలో భాగంగా మార్చి నెలలోనే సీఎం జగన్‌.. బటన్‌ నొక్కి వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేశారు. కానీ ఆ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా పోలింగ్‌ ముగియడంతో.. ఏపీ ప్రభుత్వం.. ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులు ఒక్కొక్కరి ఖాతాలో రూ.18,750 జమ చేసింది.

అలాగే వైఎస్సార్ ఆసరా కింద ప్రభుత్వం డ్వాక్రా మహిళలకురూ.1843 కోట్లను వారి, వారి ఖాతాలలో జమ చేశారు. రైతులకు సైతం రూ.1,236 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీ కింద విడుదల చేశారు. ఈ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాను ఇప్పటికే ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్హత ఉన్నలబ్ధిదారుల ఖాతాలో ఈ డబ్బుల్ని జమ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ కాకపోతే.. దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.