Salt : ఉప్పును తక్కువగా తీసుకుంటున్నారా. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!

Salt : ఉప్పు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలాగని తక్కువ పరిమాణంలో తీసుకుంటే కూడా ప్రమాదమే. అయితే ఈ రోజుల్లో అధిక రక్తపోటు మరియు మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారు వాటిని నివారించడానికి తక్కువ మొత్తంలో ఉప్పును తీసుకుంటున్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్న మాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం సోడియం ఉప్పు అనేది ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ . ఇది కణాలలోని నీటి యొక్క పరిమాణాన్ని నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక కండరాలు మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే రక్తంలో సోడియం తక్కువ అయినట్లయితే హైపోనట్రేమియా సంభవిస్తుందట. దీని కారణంగా శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Salt : రక్తంలో సోడియం ఎంత ఉంటే మంచిది…
నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం రక్తంలో సోడియం లీటర్ కు 135 నుండి 145 మిల్లీక్వివలెంట్లు ఉండాలట. ఇక 135 mEq/L కంటి తక్కువ స్థాయిలో రక్తంలో సోడియం లోపం ప్రారంభమవుతుంది. ఇక ఈ సమస్య శరీరంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది. కావున వెంటనే దీనిపై చర్యలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Salt : సోడియం లోపిస్తే ఏమవుతుంది…
రక్తంలో సోడియం లోపించటం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఆందోళన ఒత్తిడి లేదా నరాల సంబంధిత సమస్యలు రావచ్చు. అంతేకాక ఆయాసం తలనొప్పి వాంతులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే కండరాల తిమ్మిరి కూడా సోడియం లోపానికి సంకేతమని చెప్పొచ్చు.

Salt లక్షణాలు….
రక్తంలో సోడియం లోపం అనేది అనేక రకాల కారణాల వలన వస్తుంది. అయితే ఉప్పు తక్కువగా తీసుకునే వారిలో ఇది లోపం కావచ్చు. అలాగే శరీరంలో అధిక నీరు ఎలక్ట్రోలైట్స్ కోల్పోయే వారు కూడా సోడియం లోపంతో బాధపడతారు. అంతేకాక ఈ సమస్య అధిక సారం , వాంతులు, యాంటీ డిప్రెసెంట్ మందుల వలన కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఈ సోడియం లోపం అనేది మనకు రక్తంలో కనిపిస్తుంది. దీని వలన శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. ఇక దీనిని నివారించడానికి ద్రవరూపంలో ఉన్నటువంటి ఆహారాలను తీసుకోవడం మానేయాలి.అలాగే ఉప్పును తగిన పరిమాణంలో తీసుకోవాలి. తక్కువగా తీసుకున్నట్లయితే గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాక ప్రతిరోజు 3000 మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకున్న వారిలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు రక్తంలో సోడియం లోపాన్ని నివారించాలి అనుకున్నట్లయితే ప్రతిరోజు సరిపడా సోడియం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే దానిని సరైన పరిమాణంలో తీసుకోవటం ఆరోగ్యానికి మేలును కలగజేస్తుంది. అయితే తాజాగా ఓ అధ్యయనాలలో వెల్లడించిన నివేదిక ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజు 5 గ్రాముల ఉప్పు తినాలి. తద్వారా మీరు సోడియం లోపాన్ని సులువుగా అధిగమించవచ్చు. అలాగని ఉప్పు మరి ఎక్కువగా తీసుకున్నట్లయితే అది రక్తపోటుకు దారి తీసే అవకాశం ఉంటుంది జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *