ఈ ఫోన్ నెంబర్ వాడితే కన్ఫామ్ చావే.. ఒకే నెంబర్ వాడి ముగ్గురు మృతి.. దెబ్బకు నెంబర్ రద్దు..

ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి కొన్ని ఘటనల వెనక మిస్టరీ గానీ, లాజిక్ గానీ తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే చెప్పాలి. దీంతో వాటి వెనక మూలాలు ఏమిటనేది రహస్యంగానే మిగిలిపోతున్నాయి. అలాంటి ఒక ఘటనే.. బల్గేరియాలోని అన్ లక్కీ ఫోన్ నెంబర్ వెనకాల ఉన్న మిస్టరీ. ఈ మొబైల్ నెంబర్‌ను వాడిన ముగ్గురు వరుసగా మృతిచెందారు. వారు ఈ ఫోన్ నెంబర్‌ను వాడుతున్న సమయంలో మృతిచెందడంతో.. ఆ నెంబర్ వాడాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే దెబ్బకు ఆ ఫోన్ నెంబర్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
వివరాలు.. బల్గేరియన్ మొబైల్ ఫోన్ కంపెనీ మొబిటెల్ +359 888 888 888 ఫోన్ నెంబర్‌ను జారీ చేసింది. ఈ నంబర్ మొదటి యజమాని.. మొబిటెల్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్లాదిమిర్ గ్రాష్నోవ్. ఈ ఫోన్ నెంబర్ వాడుతున్న సమయంలో.. వ్లాదిమిర్ గ్రాష్నోవ్ తన 48 ఏళ్ల వయసులో 2001లో క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించాడు. అయితే వ్లాదిమిర్‌కు క్యాన్సర్ సోకేలా అతని బిజినెస్ ప్రత్యర్థి రేడియోధార్మిక విషాన్ని ప్రయోగించాడనే పుకార్లు అప్పట్లో వచ్చాయని డైలీ మెయిల్ నివేదించింది.
ఆ తర్వాత ఫోన్ నెంబర్‌ను బల్గేరియన్ మాఫియా బాస్ కాన్‌స్టాంటిన్ డిమిత్రోవ్‌కు పంపారు. డిమిత్రోవ్ 2003లో తన మాదకద్రవ్యాల అక్రమ రవాణా సామ్రాజ్యాన్ని తనిఖీ చేసేందుకు నెదర్లాండ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ అతడిని ఓ వ్యక్తి కాల్చిచంపాడు. నివేదికల ప్రకారం.. అతని సామ్రాజ్యం మొత్తం విలువ 500 మిలియన్ పౌండ్లు. మాఫియా బాస్ డిమిత్రోవ్‌, మోడల్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు దుండగడు అతడిని కాల్చి చంపాడు. ఆ సమయంలో డిమిత్రోవ్‌ వద్ద మొబైల్ ఉంది. నివేదికల ప్రకారం.. డిమిత్రోవ్ డ్రగ్-స్మగ్లింగ్ ఆపరేషన్ పట్ల అసూయతో రష్యన్ మాఫియా ఈ హత్య వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ తర్వాత ఈ ఫోన్ నంబర్ వ్యాపారవేత్త, ఎస్టేట్ ఏజెంట్ కాన్‌స్టాంటిన్ డిషిలేవ్‌కు పంపబడింది. అయితే అనుహ్యంగా బల్గేరియా రాజధాని సోఫియాలోని భారతీయ రెస్టారెంట్ వెలుపల డిషిలేవ్ కూడా కాల్చి చంపబడ్డాడు. నివేదికల ప్రకారం.. డిషిలేవ్‌ తన హత్యకు ముందు రహస్యంగా భారీ కొకైన్ ట్రాఫికింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాడు. 130 మిలియన్ పౌండ్ల డ్రగ్‌ను కొలంబియా నుండి దేశంలోకి వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో అతను మరణించాడు.
దీంతో ఆ ఫోన్‌ నెంబర్‌పై అన్ లక్కీ నెంబర్ అనే ముద్రపడింది. ఈ దెబ్బతో ప్రభుత్వం కూడా ఆ నెంబర్‌ను నిలిపివేయబడింది. ఇప్పుడు ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేసినప్పుడు.. ఫోన్ “అవుట్‌సైడ్ నెట్‌వర్క్ కవరేజ్” అని రికార్డ్ చేయబడిన సందేశాన్ని అందుకుంటారు. ఈ పరిణామాలపై మొబిటెల్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘మేము ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదు. మేము వ్యక్తిగత నెంబర్ల గురించి చర్చించలేం’’ అని చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *