సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ

భారత మొబైల్ మార్కెట్లో బాగా గుర్తింపు పొందిన శాంసంగ్ సంస్థ నుండి ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలను గుర్తిస్తూ అందుకు తగ్గట్టుగా మొబైల్స్ ను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా గెలాక్సీ సిరీస్ నుంచి వచ్చిన మొబైల్స్ మంచి ప్రజాధారణ పొందాయి. ఈ గెలాక్సీ సిరీస్ లో ముఖ్యంగా M సిరీస్ రోజురోజుకూ మరింత పాపులారిటీ పొందుతోంది. 2019లో ప్రారంభమైన గెలాక్సీ M సిరీస్ మొబైల్స్ ను “భారతదేశంలో తయారు చేయబడినది, భారతీయుల కోసమే రూపొందించబడినది” అని సామ్‌సంగ్ కంపెనీ ప్రత్యేకంగా హైలైట్ చేస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా Galaxy M36 5G పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.


మరి కొత్తగా రాబోతున్న గెలాక్సీ M36 5G డిజైన్, ప్రత్యేకతలను చూస్తే.. Galaxy M36 5G మోడల్‌ను కంపెనీ స్లీక్ డిజైన్, లైట్‌ వెయిట్ బాడీ, కొత్త కలర్ ప్యాలెట్‌తో విడుదల చేయనుంది. డిజైన్‌ లో మార్పులు, కొత్త తరం ఫినిషింగ్‌తో యూజర్లను ఆకట్టుకునేలా చేసినట్లు శాంసంగ్ ప్రకటించింది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో AI ఆధారిత ఫీచర్లు ఉండనున్నాయి. ఇవి వినియోగదారుల దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేయనున్నాయని కంపెనీ చెబుతోంది.

ఇక గీక్‌ బెంచ్ లిస్టింగ్ సమాచారం ప్రకారం.. అధికారిక స్పెసిఫికేషన్లు ఇంకా బయటపడకపోయినా, ఈ ఫోన్‌లో ఉండబోయే టెక్నికల్ వివరాలు కొన్ని లీక్ అయ్యాయి. ఇందులో Exynos 1380 ప్రాసెసర్ వాడనున్నారు. అలాగే ఇందులో కనీసం 6GB RAM ఉన్నట్లు తెలుస్తోంది. One UI 7 , ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్ పై పని చేయనుంది. ఇంకా డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి ఇతర ముఖ్యమైన వివరాలు మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ M36 5G త్వరలో అమెజాన్ స్పెషల్స్ భాగంగా అమెజాన్ లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ‘Notify Me’ పేజీ లైవ్ అయ్యింది. ఈ ఫోన్ ధర రూ. 20,000 కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. మొత్తంగా భారత వినియోగదారులకు అనుగుణంగా రూపొందించబడిన సామ్‌సంగ్ గెలాక్సీ M సిరీస్‌లో కొత్తగా రాబోయే Galaxy M36 5G శక్తివంతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ఇంకా తక్కువ ధరతో మార్కెట్‌ను ఆకర్షించే అవకాశం ఉంది. అధికారిక విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్ల కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.