తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. హీరోలను స్టార్ హీరోలుగా మార్చే క్రమంలో దర్శకులు సైతం చాలా వరకు కష్టపడుతున్నారు. అందువల్లే మంచి కథలను రెడీ చేసుకొని సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇప్పటివరకు ఇండియాలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.
శేఖర్ కమ్ముల (Shekar Kammula) లాంటి దర్శకుడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాల పైబడినప్పటికి ఆయన మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళ్ స్టార్ హీరో అయిన ధనుష్ (Dhanush) ను హీరోగా పెట్టి చేసిన కుబేర (Kubera) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే దీపక్ (నాగార్జున) అనే ఎక్స్ సిబిఐ ఆఫీసర్ తను చేసే ఒక ఆపరేషన్ లో దేవా (Dhanush) అనే ఒక బిచ్చగాడితో కలిసి ఆ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మరి దేవా వల్ల దీపక్ కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీపక్ ఎందుకని ఆ ఆపరేషన్ కోసం దేవ ను ఎంచుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా స్ట్రైట్ గా తను ఎంచుకున్న పాయింట్ ను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. మొదటి పది నిమిషాల్లోనే ఈ సినిమా కథ ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక క్యారెక్టర్స్ మధ్య డ్రామాను క్రియేట్ చేస్తూ ప్రేక్షకుడిని రెండున్నర గంటల పాటు ఎంగేజ్ చేయడంలో శేఖర్ కమ్ముల కొంతవరకు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఈ సినిమాలో ధనుష్ కాకుండా వేరే ఏ హీరో అయినా కూడా వర్కౌట్ అయ్యేది కాదు. ధనుష్ బిచ్చగాడి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇక సినిమా లో ఏ పాయింట్ అయితే చెప్పాలనుకున్నారో దానిని చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు.
ఫస్టాఫ్ స్లో నరేషన్ అనిపించినప్పటికి సెకండ్ హాఫ్ లో ధనుష్ క్యారెక్టర్ మీదనే సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం చేశారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో ధనుష్ చెప్పే మాటలు ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాయనే చెప్పాలి. కోర్ ఎమోషనల్ సీన్స్ లో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు ప్లస్ అయింది… నాగార్జున కూడా ఈ సినిమాలో అదనపు ఆకర్షణగా నిలిచి సినిమాని ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తను కూడా చాలా కీలక పాత్ర వహించాడు…ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ పది నిమిషాల్లోనే స్టోరీ మొత్తం చెప్పేయడం వల్ల రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని హోల్డ్ చేసి కూర్చోబెట్టడం అనేది కొంతవరకు కష్టతరం అయింది.
అలాకాకుండా సినిమా స్క్రీన్ ప్లే ఆర్డర్ ని ఇంకొంచెం మార్చుంటే బాగుండేది. అలాగే ప్రేక్షకుడికి సినిమా మీద సీన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగేది. ఫస్టాఫ్ బోరింగ్ గా ఉండటం వల్ల ఇంటర్వెల్ ఇంకెప్పుడు వస్తుందా అని ప్రతి ప్రేక్షకుడు ఎదురుచూస్తూ ఉండడం అనేది కూడా ఈ సినిమాకి చాలా వరకు మైనస్ గా మారింది. విలన్ పాత్ర కూడా పెద్దగా ఎలివేట్ అయితే అవ్వలేదు. మొదటి ఐదు నిమిషాలు విలన్ చాలా స్ట్రాంగ్ గా కనిపించినప్పటికి ఆ తర్వాత ఆయన పాత్రలో క్లారిటీ లేకపోవడం వల్ల రైవల్టీ అనేది సరిగ్గా కుదరలేదు. ఇక ఈ సినిమా మొత్తం ఒకే పాయింట్ మీద తిరగడం వల్ల సీన్స్ మొత్తం రిపీటెడ్ గా అనిపిస్తూ ఉంటాయి. నాగార్జున పాత్ర ను ఇంకొంచెం డెప్త్ గా రాసి ఉంటే బాగుండేది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ధనుష్ బిచ్చగాడి క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించాడు. ఈ మధ్యకాలంలో ధనుష్ చేసిన సినిమాలన్నింటిలో ఈ ఒక్క పాత్ర తనకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ధనుష్ తప్ప ఆ పాత్రకి ఇంకెవరు సెట్ అవ్వరు అనే రేంజ్ లో నటించాడు. ఇక ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ లో చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ ని ఇచ్చి తన క్యారెక్టర్ ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా నటించి మెప్పించాడు… ఆ క్యారెక్టర్ లో మనకు ఎక్కడా కూడా ధనుష్ అయితే మనకు కనిపించలేదు. స్క్రీన్ మీద దేవా అనే ఒక పర్సన్ ని మనం చూస్తున్నాం అనే ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. శేఖర్ కమ్ముల పేపర్ మీద ఏదైతే రాశాడో అంతకుమించి దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు… నాగార్జున సీబీఐ ఆఫీసర్ గా చాలా మంచి పాత్రలో నటించాడు. ముఖ్యంగా ఆయన ఇంతకుముందు చేసిన డిఫరెంట్ పాత్రలకు మించి ఈ పాత్ర అయితే ఉంది. నాగార్జున అనగానే మనకు ఒక సాఫ్ట్ క్యారెక్టర్స్ గుర్తొస్తూ ఉంటాయి.
కానీ ఈ సినిమాలో ఆయన ప్రేక్షకులను నవ్విస్తూ ఏడిపిస్తూ విభిన్న హావా భావాలను పలికిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు… గత నాలుగు సంవత్సరాల నుంచి నాగార్జునకు చెప్పుకోదగ్గ పాత్ర అయితే దొరకలేదు. ఈ పాత్ర ఆయనలో ఒక కొత్త యాంగిల్ ను బయటికి తీసిందనే చెప్పాలి. రష్మిక మందాన తన పాత్ర పరిధిని మించకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్ ని ఇచ్చింది. డబ్బు మీద పిచ్చి ఉన్న ఒక లేడీ ఎలాంటి పనులు చేస్తుంది. ఆమెకు డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ తనని ఎలా మారుస్తుంది అనే ఒక పాత్రలో రష్మిక అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చిందనే చెప్పాలి…విలన్ గా నటించిన జిమ్ సర్బ్ తన యాక్టింగ్ తో ఒకే అనిపించాడు… దలిప్ తాహిల్ కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. ఆయన ఇచ్చిన బ్యా గ్రౌండ్ స్కోర్ కోర్ ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా హైలైట్ చేశాయి… ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా కోసం చాలావరకు మాంటెజెస్ ను అయితే వాడారు. వాటన్నింటినీ విజువల్ గా సినిమాటోగ్రాఫర్ చాలా బాగా ఎలివేట్ చేస్తూ కెమెరాలో బంధించాడు…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
ధనుష్ యాక్టింగ్
డైరెక్షన్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ
ఫస్టాఫ్
స్లో నరేషన్
అనవసరపు సీన్స్
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.5/5