గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త శాంసంగ్ 5జీ ఫోన్ భలే ఉందిగా

శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A26 5G ఫోన్ లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.


అయితే, ఈ 5జీ ఫోన్ లాంచ్‌కు ముందే ధర వివరాలు లీక్ అయ్యాయి. కీలక ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్‌ను Galaxy A06 5G, గెలాక్సీ A26 5G, గెలాక్సీ A36 5G, గెలాక్సీ A56 5G వంటి కొత్త మోడళ్లతో విస్తరించింది.

ఈ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 15-ఆధారిత One UI 7 కస్టమ్ స్కిన్, 50MP ప్రైమరీ కెమెరా “Awesome Intelligence” అనే ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ఈ గెలాక్సీ మోడళ్లలో చాలా వరకు ఫోన్లు భారత మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయ్యాయి.

కానీ, శాంసంగ్ గెలాక్సీ A26 5G ఫోన్ ఒక్కటే ఇంకా రిలీజ్ కాలేదు. అయితే, లీక్‌ల ప్రకారం.. ఈ 5జీ ఫోన్ లాంచ్ ఆసన్నమైందని సూచిస్తున్నాయి. ధర వివరాలు లీక్ అయ్యాయి. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ A26 ధర (లీక్) :
శాంసంగ్ గెలాక్సీ A26 టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నివేదికల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A26 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో రెండు (8GB + 128GB, 8GB + 256GB) స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ కావచ్చు. ఈ రెండు వెర్షన్ల ధర వరుసగా రూ. 24,999, రూ. 27,999 ఉండే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A26 5G ఫీచర్లు :
డిస్‌ప్లే : ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1080 x 2340 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన 6.7 స్క్రీన్‌ను కలిగి ఉంది.

డిజైన్ : శాంసంగ్ గెలాక్సీ A26 5G ఫోన్ బరువు 200 గ్రాములు, 164 x 77.5 x 7.7mm కొలతలు కలిగి ఉంది.

ప్రాసెసర్ : కంపెనీ సొంత 5nm ఫాబ్రికేషన్ల ఆధారంగా 2GHz క్వాడ్ A55 + 2.4GHz క్వాడ్ A78 కోర్లను కలిగింది. ఇందులో Exynos 1380 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ 5G శాంసంగ్ ఫోన్‌కు పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ గ్రాఫిక్స్ కార్డు మాలి-G68 MP5 GPUని కలిగి ఉంది.

స్టోరేజీ : ఈ ఫోన్ 6GB/128GB, 8GB/128GB, 8GB/256GB అనే 3 వేర్వేరు స్టోరేజీలలో వస్తుంది.

OS : ఆపరేటింగ్ సిస్టమ్ One UI7 (6 మెయిన్ ఆండ్రాయిడ్ OS అప్‌‍డేట్స్ సపోర్టు ) Android 15 ఆధారంగా రూపొందించింది.

కెమెరాలు : సెల్ఫీల కోసం 13MP (వైడ్) ఫ్రంట్ కెమెరా, బ్యాక్ సైడ్ 50MP (వైడ్) + 8MP (అల్ట్రా-వైడ్) + 2MP (మాక్రో) ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉన్నాయి.

బ్యాటరీ : ఈ ఫోన్ పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కలర్ ఆప్షన్లు : ఈ ఫోన్ కలర్ ఆప్షన్లలో బ్లాక్, వైట్, మిట్, పీచ్ పింక్ ఉన్నాయి.

మరెన్నో ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ A26 5G యూజర్లకు IP67 సెక్యూరిటీ రేటింగ్, సైడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, 2G, 3G, 4G, 5G నెట్‌వర్క్‌లకు కూడా సపోర్టు చేస్తుంది.