ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. కస్టమర్లకు రూ.30 లక్షల బెనిఫిట్, అర్హత

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక శాలరీ, పెన్షన్ అకౌంట్‌ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది.


ఈ అకౌంట్‌కి మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. హై పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ వంటి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (DFS) చేపట్టిన ఒక పెద్ద ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకుంది.

ఇటీవల DFS ప్రభుత్వ రంగ బ్యాంకుల సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాంపోజిట్ శాలరీ అకౌంట్‌ ప్యాకేజీని ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఇబ్బందు లేని బ్యాంకింగ్ సేవలను అందించడం దీని లక్ష్యం.

SBI కాంప్రహెన్సివ్‌ పెన్షన్ ప్యాకేజీకి ఎవరు అర్హులు?
70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కాంప్రహెన్సివ్‌ పెన్షన్ ప్యాకేజీ (Comprehensive Pension Package) అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ కింద అకౌంట్‌ ఓపెన్‌ చేసే లేదా ఉన్న పెన్షనర్లకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, ఫ్రీ SMS అలర్ట్స్‌ అందుతాయి, రూపే ప్లాటినం గోల్డ్ డెబిట్ కార్డ్ లభిస్తుంది, డెబిట్ కార్డ్ ఇష్యూకి ఎటువంటి ఛార్జీలు లేవు. ఈ ఫీచర్స్‌తో బ్యాలెన్స్ లిమిట్‌ లేదా అదనపు ఛార్జీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒత్తిడి లేని బ్యాంకింగ్‌ని సీనియర్‌ సిటిజన్లు పొందవచ్చు.

పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా మనీ సేవింగ్ టిప్స్ గురించి ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయా? మీ ప్రశ్నను ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ నుండి సమాధానాలు పొందొచ్చు. ఎంపిక చేసిన ప్రశ్నలకు సమాధానాలను మా వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ రూపంలో మరుసటి రోజు చూడొచ్చు.

పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌
అలానే పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ కూడా ఉంటుంది. రూ.30 లక్షల వరకు యాక్సిడెంటల్‌ డెత్‌ ఇన్సూరెన్స్‌ (Personal accident insurance) కవర్ (అనుమతికి లోబడి) లభిస్తుంది. దీని కింద అడిషినల్‌ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ (PAI వర్తిస్తే) ఏంటంటే, పెన్షనర్ పర్సనల్‌ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌కి అర్హులైతే, వారు అనేక యాడ్-ఆన్ కవర్లను కూడా పొందవచ్చు. ఇవి అత్యవసర సమయాల్లో ఎక్స్‌ట్రా ఫైనాన్షియల్‌ ప్రొటెక్షన్‌ అందిస్తాయి.

కాలిన గాయాల ట్రీట్‌మెంట్‌, ప్లాస్టిక్ సర్జరీకి రూ.10 లక్షల వరకు అందుతుంది. ఇంపోర్టెడ్ మెడిసిన్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి రూ.5 లక్షల వరకు అందుతుంది. ప్రమాదం కారణంగా 48 గంటలకు పైగా కోమాలో ఉన్న తర్వాత మరణిస్తే రూ.5 లక్షల వరకు, ఎయిర్ అంబులెన్స్ సేవలకు రూ.10 లక్షల వరకు పరిహారం ఇస్తారు.

పిల్లలకు (18- 25 సంవత్సరాల వయస్సు గల) ఉన్నత విద్య కోసం రూ.8 లక్షల వరకు అందుతుంది. ఆడపిల్లలకు రూ.10 లక్షల వరకు లభిస్తుంది. ప్రమాద స్థలానికి చేరుకోవడానికి ఇద్దరు కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చుల కోసం రూ.50,000 వరకు నిధులు ఇస్తారు. మృతదేహాలను స్వదేశానికి తరలించడానికి రూ.50,000 వరకు పొందవచ్చు. అంబులెన్స్ ఛార్జీల కోసం రూ.50,000 వరకు అందుతుంది. ఈ యాడ్-ఆన్ బెనిఫిట్స్‌ సీరియస్‌ మెడికల్‌ లేదా యాక్సిడెంట్‌ రిలేటెడ్‌ సిచ్యువేషన్స్‌లో అదనపు రక్షణ ఇస్తాయి.

ఇతర బ్యాంకుల ప్యాకేజీలు
ఇందులో SBI కాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా జాయిన్‌ కావచ్చు. త్వరలో ఈ ఇనిషియేటివ్‌ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాలరీ, పెన్షన్ అకౌంట్‌ ప్యాకేజీలను ప్రవేశపెట్టవచ్చు. అర్హత, నిబంధనలు, ఇన్సూరెన్స్‌ కండిషన్స్‌ గురించి పూర్తి సమాచారం కోసం, పెన్షనర్లు, దగ్గర్లోని బ్యాంకు బ్రాంచ్‌ని విజిట్‌ చేయవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.