దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అదిరే ఆఫర్ తీసుకొచ్చింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టులను భర్తీ చేసేందుకు పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా 996 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు డిసెంబర్ 23తో ముగియనుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.లక్షల్లో జీతాలు ఉండనున్నాయి. నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
మొత్తం పోస్టులు..
996
ఖాళీల వివరాలు..
VP Wealth SRM (Senior Relationship Manager)
AVP Wealth RM (Wealth Relationship Manager)
Customer Relationship Executive
వంటి అత్యంత కీలకమైన పోస్టులు ఉన్నాయి. ఇవి బ్యాంక్ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో ప్రధాన పాత్ర పోషించే పదవులు కావడంతో, ఎంపికయ్యే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయి వర్క్ ప్రొఫైల్ లభిస్తుంది.
విద్యార్హత..
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి స్పెషలైజేషన్ అయినా సరిపోతుంది. అయితే ఫైనాన్స్, బ్యాంకింగ్, మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివిన వారికి ఎంపికలో అదనపు అవకాశం లభించే అవకాశం ఉంది. అదనంగా సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వయస్సు పరిమితులు..
2025 మే 1 నాటికి అభ్యర్థుల వయస్సు ఇలా ఉండాలి:
VP Wealth SRM: 26 – 42 సంవత్సరాలు
AVP Wealth RM: 23 – 35 సంవత్సరాలు
Customer Relationship Executive: 20 – 35 సంవత్సరాలు
వయస్సులో ఎలాంటి ప్రత్యేక రాయితీలు ప్రస్తుతం పేర్కొనలేదు. కాబట్టి అర్హత గల వయస్సులో ఉన్నవారే వెంటనే అప్లై చేయడం మంచిది.
జీతం..
VP Wealth SRM: సంవత్సరానికి రూ.44.7 లక్షలు
AVP Wealth RM: సంవత్సరానికి రూ.30.2 లక్షలు
Customer Relationship Executive: సంవత్సరానికి రూ.6.20 లక్షలు
అదనంగా ఇన్సెంటివ్స్, పెర్ఫార్మెన్స్ బోనస్‌లు, ప్రయాణ భత్యం, మెడికల్ అలవెన్స్, ఇతర కార్పొరేట్ సౌకర్యాలు కూడా లభించవచ్చు.
ఎంపిక విధానం..
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
మొదటగా అభ్యర్థులు పంపిన అప్లికేషన్లను పరిశీలించి షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
షార్ట్‌లిస్టైనవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది.
ఇంటర్వ్యూలో బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, కస్టమర్ హ్యాండ్లింగ్, మార్కెట్ అవగాహన వంటి అంశాలు ఎక్కువగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు..
జనరల్ / OBC / EWS: రూ.750
SC / ST / PwD: ఫీజు మినహాయింపు
దరఖాస్తు గడువు..
2025 డిసెంబర్ 2 నుంచి 2025 డిసెంబర్ 23 వరకు
అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అఫీషియల్ వెబ్‌సైట్: https://sbi.bank.in/. ఆన్‌లైన్ ఫారాన్ని నింపేటప్పుడు విద్యార్హత వివరాలు, వ్యక్తిగత సమాచారం, ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్, అవసరమైన సర్టిఫికేట్లు జాగ్రత్తగా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ పరిశీలించాలి.

































