విద్యార్ధులకు బిగ్ అలర్ట్ – రేపు పాఠశాలల బంద్

పీలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ కోరుతూ రేపు (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు – అన్ ఏయిడెడ్ పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.


ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆహ్వా నిస్తూనే.. కొందరు అధికారుల తీరు.. నోటీసుల జారీ వంటి వాటి పైన అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఈ బంద్ కు నిర్ణయించారు.

ప్రయివేటు స్కూళ్ల మేనేజ్ మెంట్ అసోసియేషన్ రేపు పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రయివేటు పాఠశాలల పై తీసుకుంటున్న ఏకపక్ష చర్యల పై రాష్ట్ర వ్యాప్త నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు, ఏయిడెడ్ పాఠశాలల గుర్తింపు పునరుద్దరణ ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సాలకు పొడిగింపు.. ప్రతిభ అవార్డులలో ప్రయివేటు సంస్థల విద్యార్ధులను చేర్చినందుకు.. తల్లికి వందనం లో తమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూనే తమ సమస్యలను అసోసియేషన్ వివరించింది. అయితే, కొంత మంది అధికారులు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల పై అతిగా స్పందించటం పైన ఆవేదన వ్యక్తం చేసింది

పాఠశాలల పై నియమించిన కమిటీలు, తనిఖీలు అమలు చేయటం విచారకరమని పేర్కొంటు న్నాయి. కొంత మంది లేఖలు.. తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటి కప్పుడు నోటీసులు జారీ చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆదేశాలు తక్షణం అమలు చేయాలని ఫీల్డ్ అధికారుల నుంచి అగౌరవ సందేశాలు.. హెచ్చరికలు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాల్లో వేదన కలిగిస్తున్నాయ ని పేర్కొన్నాయి. వీటి కారణంగా సిబ్బంది, విద్యార్ధులను కలవర పెడుతున్నాయని చెబుతు న్నారు.

కొంత మంది అధికారులు తీసుకున్న అన్యాయమైన, ఏకపక్ష నిర్ణయాలు – ప్రయివేటు అన్ ఎయిడెట్ పాఠశాలల యాజమాన్యాలకు ఇబ్బందిగా మారాయి. గుర్తింపు రద్దు బెదిరింపులకు ప్రతిస్పందనగా రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు పాఠశాలలు జూలై 3న మూసివేయాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం తమ వేదన అర్దం చేసుకొని తమ హక్కులను కాపాడాలని కోరుతున్నారు. నియమాలను పరిశీలించకుండా నోటీసులు.. చర్యల కు ఉపక్రమించ వద్దని అభ్యర్ధిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.