ఏకకాలంలోరెండు ఉద్యోగాలు చేస్తున్నభారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని ‘గ్రాండ్లార్సెనీ’ (పెద్దమొత్తంలోదొంగతనం) అభియోగాలపైఅమెరికా అధికారులు అరెస్టు చేశారు.
న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్లోరిమోట్గా పనిచేస్తున్న39 ఏళ్ల మెహుల్ గోస్వామిపై మాల్టా పట్టణంలో రెండవ ఉద్యోగం చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారుల నిధులలో 50,000 డాలర్లకు పైగా దుర్వినియోగంచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈనాన్ బెయిలబుల్ క్లాస్ సి నేరానికి ఇతను15 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడు.
మెహుల్ గోస్వామిపై అభియోగాలుఇవే..
మెహుల్ గోస్వామి 2022 మార్చిలో మాల్టాలోని గ్లోబల్ ఫౌండ్రీస్ కోసం కాంట్రాక్టర్ గా రెండవ ఉద్యోగంలో పనిచేయడం ప్రారంభించాడు. సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం.. గోస్వామి న్యూయార్క్ రాష్ట్రప్రభుత్వఉద్యోగం చేస్తూనేసెమీకండక్టర్ సంస్థలో రెండోఉద్యోగంచేశాడు.
“ప్రభుత్వ ఉద్యోగులకు సమగ్రతతో పనిచేసే బాధ్యతను అప్పగించారు. కానీగోస్వామి ఆబాధ్యతను తీవ్రంగా ఉల్లంఘించారు” అని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ పేర్కొన్నారు.
“ప్రభుత్వంకోసం పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ రెండవ, పూర్తికాల ఉద్యోగం చేయడం పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో సహా ప్రజా వనరులను దుర్వినియోగం చేయడమే” అని లాంగ్ స్పష్టం చేశారు.
15 ఏళ్ల జైలు శిక్ష
































