ఈ రంగు చూస్తే ఎద్దుకే కాదు.. కుక్కకి కూడా కోపం వస్తుంది..! రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్త

www.mannamweb.com


ఎద్దు ఎరుపు రంగును చూసి కోపం తెచ్చుకుంటుంది. ఎరుపు రంగును చూసిన వెంటనే ఆ రంగు దుస్తులు వేసుకున్న వారిని వెంబడించి పరుగెత్తిస్తుంది. కుక్కకు కూడా ఒక రంగును చూస్తే కోపం వస్తుందని ఒక పరిశోధనలో తేలింది.

కుక్కకు ఏ రంగు నచ్చదు.. పరిశోధన ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

కుక్క చాలా ప్రేమ, దయగల జంతువు. మనుషుల పట్ల అత్యంత విశ్వంసం కలిగి ఉంటుంది. మీరు వ్యవహరించే విధానం ప్రకారం అది మిమ్మల్ని ప్రేమిస్తుంది. అయితే ఒక్కోసారి కుక్కలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాయి. దీని వెనుక చాలా కారణాలున్నాయి. అయితే ఇప్పుడు ఓ పరిశోధనలో షాకింగ్ విషయం బయటపడింది. ఎద్దు ఎరుపు రంగును చూసి కోపం తెచ్చుకుంటుంది. ఆ రంగు వెంట పరుగెత్తినట్లుగా, ఈ రంగును చూసి కుక్కకు కూడా కోపం వస్తుందని ఓ నివేదిక వెల్లడించింది.

కుక్కలకు నలుపు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి అవి నలుపు రంగును చూస్తే గట్టి గట్టిగా అరవటం, మోరాయిస్తూ ఉంటాయని చెప్పారు. నలుపు రంగు, వస్తువులు లేదా నీడలు ఏదో ఒక రహస్యాన్ని సూచిస్తాయి. దీనివల్ల కుక్కలకు నలుపు రంగు నచ్చదని తెలిసింది. అయితే ఇది అన్ని కుక్కలకు వర్తించదని నిపుణులు చెబుతున్నారు.