Senior NTR’s car ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలుసా.

నందమూరి నటి సార్వభౌమ తారక రామారావు తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ఆయన.. రాజకీయంగా చరిత్ర సృష్టించారు. తెలుగు వారి ఆరాధ్య దైవంగా కోట్లాదిమంది హృదయాల్లో గూడుకట్టుకున్నాడు.


ఇప్పటికీ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో చెరగని అభిమానం ఉంది. సినిమాలో అయినా, రాజకీయాలైనా ఆయన ప్రస్తావన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకులు, మనవాళ్లు, కూతుళ్లు సినీ, రాజకీయ పరిశ్రమల్లోకి అడుగుపెడుతూనే ఉన్నారు. ఇక ఆయన గురించి, ఆయనకు సంబంధించిన వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఈ జనరేషన్ ఆడియన్స్‌లోను నెలకొంటుంది.

అలాంటి ఎన్టీఆర్ ఆయన కెరీర్‌లో కొన్ని రకాల కార్స్ ఎక్కువగా వాడుతూ ఉండేవారు. ఆయనకు ఇష్టమైన ఎక్కువ రోజులు వాడిన కారు ఒకటి. ఇప్పటికీ ఓ స్టార్ హీరో దగ్గరే ఉంది. ఎన్టీఆర్ ఓ అంబాసిడర్ కారుని చాలా రోజులు తన దగ్గరే ఉంచుకున్నారు. సీఎం అయ్యాక.. ఆయన బతికున్నంత వరకు చివరి రోజుల్లో కూడా అదే కార్‌ అయన వాడారు. ఆ కార్ అంటే చాలా ఇష్టం. ఇక ఆ కార్ నెంబర్ ABY 9999. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆ కార్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. కాగా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వస్తువులను వేలంపాట వేస్తుందని సంగతి తెలిసిందే. అలా సీనియర్ ఎన్టీఆర్కు ఎంతో ఇష్టమైన ఆ అంబాసిడర్ కారును కూడా వేలం వేశారు.

ఆ వేలం పాటలో ఎన్టీఆర్ కార్‌ను మనవడు స్టార్ హీరో కళ్యాణ్ రామ్ దక్కించుకున్నాడు. తన తాతయ్యపై ఉన్న అమితమైన ప్రేమతో.. కళ్యాణ్ రామ్ వేలం పాట పాడి కొనుక్కున్నారు. ఆ కార్ ఇప్పటికే ఆయన ఆఫీసులో జాగ్రత్తగా దాచుకున్నారు. కళ్యాణ్ రామ్ ఆఫీస్‌కి వెళ్ళగానే బయట సీనియర్ ఎన్టీఆర్‌కు ఇష్టమైన ABY 9999 కార్ ఉంటుంది. ఆయనకు గుర్తుగా కళ్యాణ్ రామ్ ఆ కార్‌ను తన దగ్గరే దాచుకున్నారు. ఆయన ఆఫీస్ కి ఎవరైనా కొత్త వాళ్లు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ కార్‌ను ఫోటో తీసుకుంటూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ మరో మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాతతా.. తను కొన్నే కార్‌లు అన్నింటికీ 9999 నెంబర్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన అదే నెంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తాడని టాక్. అలాగే నందమూరి ఫ్యామిలీలో ఈ తొమ్మిది సెంటిమెంట్ చాలామందికి ఉంది.