మే1 నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ‘ఒక రాష్ట్రం – ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)’ అనే విధానం మే 1 నుంచి అమల్లోకి రానుంది.
ఈ ప్రతిపాదన ప్రకారం.. 11 రాష్ట్రాలలో 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విలీనం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణలో నాల్గవ దశ. దీని తర్వాత దేశంలో RRB (Regional Rural Bank)ల సంఖ్య 43 నుండి 28కి తగ్గుతుంది. ఈ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అనేక ప్రభుత్వ బ్యాంకులతో అనుబంధంగా ఉన్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత బలోపేతం చేస్తుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. దీని ప్రభావం దేశంలోని 11 రాష్ట్రాలలో కనిపిస్తుంది. అవి ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ మరియు కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్. ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఒకే సంస్థగా విలీనం కానున్నాయి. ఈ విధంగా ప్రభుత్వం ‘ఒక రాష్ట్రం-ఒక RRB’ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం కోసం తేదీ మే 1, 2025గా నిర్ణయించారు.
ఈ క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విలీనం అయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా ఏర్పడతాయి.
ఉత్తరప్రదేశ్, మరియు పశ్చిమ బెంగాల్‌లోని మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBలు) ఒకే సంస్థగా విలీనం అవుతాయి. ఉత్తరప్రదేశ్‌లో, బరోడా యూపీ బ్యాంక్, ఆర్యవర్ట్ బ్యాంక్, ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ‘ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంకు’ ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారంతో లక్నోలో ఉంటుంది. అదేవిధంగా ‘బంగియా గ్రామీణ వికాస్ బ్యాంక్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకు, ఉత్తర్‌బాంగ్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంకును పశ్చిమ బెంగాల్‌లో స్థాపించనున్నారు.
గుజరాత్, బీహార్ జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రెండు ఆర్‌ఆర్‌బీలను కలిపి ఒకటి ఏర్పాటు కానున్నాయి.
ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో 3 ఆర్‌ఆర్‌బీలను కలిపి ఒక దాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇక్కడ కొత్త ఆర్‌ఆర్‌బీగా ఉత్తరప్రదేశ్ గ్రామీణ్ బ్యాంక్ ఏర్పాటు అవుతుంది. దీని ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంటుంది. దీనికి స్పాన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా.
బెంగాల్‌లో కొత్త ఆర్‌ఆర్‌బీగా బంగాల్ గ్రామీణ్ బ్యాంక్ ఏర్పాటవుతుంది. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంటుంది. స్పాన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు.
బీహార్‌లో కొత్త ఆర్‌ఆర్‌బీగా బిహార్ గ్రామీణ్ బ్యాంక్ ఏర్పాటవుతుంది. దీని ప్రధాన కార్యాలయం పాట్నాలో ఉంటుంది. స్పాన్సర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు.
గుజరాత్‌లో కొత్త ఆర్‌ఆర్‌బీగా గుజరాత్ గ్రామీణ్ బ్యాంక్ ఏర్పాటవుతుంది. దీని హెడ్ ఆఫీస్ వడోదరలో ఉంటుంది. దీనికి స్పాన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా.
జమ్మూకశ్మీరులో కొత్త ఆర్‌ఆర్‌బీగా జమ్మూకశ్మీర్ గ్రామీణ్ బ్యాంక్ ఏర్పాటవుతుంది. దీని ప్రధాన కార్యాలయం జమ్మూకశ్మీర్‌లో ఉంటుంది. దీనికి స్పాన్సర్ జే అండ్ కే బ్యాంక్.
































